ట్రినిడాడ్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. 86/1 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభంచిన విండీస్ 117 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన మెకెంజీ.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ముఖేష్ కుమార్‌కు ఇదే తొలి అంతర్జాతీయ వికెట్ కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌తోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇక విండీస్ రెండో వికెట్ కోల్పోయిన వెంటనే వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ 49 పరుగులతో ఉన్నాడు.
ఇక అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లు బ్యాటింగ్ చేసి 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో కోహ్లి(121) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(80), జడేజా(61) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో రోచ్, వారికిన్ తలా మూడు వికెట్లు సాధించగా.. హోల్డర్ రెండు, గాబ్రియల్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్! పంత్ రీ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment