ట్రినిడాడ్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆఖరి టెస్టులో విండీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ బ్యాటర్ కిర్క్ మెకెంజీ డెబ్యూ చేయగా.. పేసర్ షానన్ గాబ్రియెల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు టీమిండియా ఒకే ఒక మార్పుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు శార్ధూల్ ఠాకూర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
తుది జట్లు
వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టాగెనరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెల్
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్
చదవండి: Tilak Varma: స్కూల్‌లో అకౌంట్ సెక్షన్‌లో పనిచేశా! తిలక్ వల్లే ఇలా! ఇప్పుడు తను మారిపోయాడు! ఆశ్చర్యపోయా..
Comments
Please login to add a commentAdd a comment