టీమిండియా పేసర్ ముఖేష్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా ముఖేష్ కుమార్ రికార్డులకెక్కాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20కు తుది జట్టులో చోటు దక్కించుకున్న ముఖేష్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు.
అంతకుముందు ముఖేష్ ఇదే పర్యటనలో విండీస్‌పై టెస్టు, వన్డే డెబ్యూ చేశాడు. కాగా ఈ ఘనత సాధించిన జాబితాలో ముఖేష్ కంటే ముందు టీమిండియా పేసర్ నట్‌రాజన్ ఉన్నాడు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్‌లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో ముఖేష్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
3 ఓవర్లు బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్ 24 పరుగులిచ్చి వికెట్లు ఏమీ పడగొట్టలేదు. అంతకుముందు విండీస్‌తో సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో మాత్రం ముఖేష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. విండీస్ చేతిలో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో హార్దిక్‌సేన చతికిలపడింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగల్గింది.
భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలరల్లో మెకాయ్, హోల్డర్, షెపర్డ్ తలా రెండు వికెట్లు సాధించగా, అకేల్ హోసేన్ ఒక్క వికెట్ పడగొట్టాడు .అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. కెప్టెన్ పావెల్(48), పూరన్(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
చదవండి: అస్సలు నేను ఊహించలేదు.. కొన్ని తప్పులు చేశాం! అతడొక సంచలనం: హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment