టీమిండియా తరపున ఆడాలన్న బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ కల ఎట్టకేలకు నేరవేరింది. ట్రినిడాడ్ వేదికగా వెండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున అంతర్జాతీయ అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు.
కాగా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ముఖేష్ కుమార్‌కు చోటు దక్కడం లేదు. అయితే రెండో టెస్టుకు గాయం కారణంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఈ క్రమంలో ముఖేష్ కుమార్‌కు గురుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎవరీ ముఖేష్ కుమార్?
28 ఏళ్ల ముఖేష్ కుమార్ 1998లో బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జన్మించాడు. అతడి తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే ముఖేష్ మొదటి నుంచి మిలిటరీ, పోలీస్ ఉద్యోగాల్లో చేరి దేశానికి సేవచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 2012లో నిర్వహించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బీహార్ పోలీస్ ఉద్యోగాల వ్రాత పరీక్షలను ముఖేష్ క్లియర్ చేశాడు.
కానీ పోషకాహార లోపం బోన్ ఎడిమ, మోకాళ్ల నొప్పుల కారణంగా ఫిట్‌నెస్ పరీక్షల్లో మాత్రం అతడు నెగ్గలేకపోయాడు. ఈ సమయంలో అతడి తండ్రి సూచన మేరకు ముఖేష్ కుమార్ క్రికెట్ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక కోల్‌కతాలోని బని నికేతన్ స్పోర్ట్స్ క్లబ్‌లో బీరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు.
ఆ తర్వాత బెంగాల్ డివిజన్ లీగ్ క్రికెట్‌లో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2014లో సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో ముఖేష్ కుమార్‌కు చోటు దక్కింది. దీంతో బెంగాల్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో ముఖేష్ కుమార్ పాల్గొనున్నాడు. ఇదే అతడికి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్.
అయితే ఇదే సమయంలో అతడికి ఫిట్‌నెస్ ఒక ప్రధాన సమస్యగా వెంటాడింది. కానీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) సహకారంతో అతడు తన ఫిట్‌నెస్ లెవల్స్‌ను పెంచుకున్నాడు. ఆ తర్వాత 2015లో బెంగాల్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ముఖేష్ అడుగుపెట్టాడు. కానీ ఎక్కువ కాలం తన సంతోషాన్ని ముఖేష్ నిలుపుకోలేకపోయాడు.
పేలవ ప్రదర్శన, ఫిట్‌నెస్ కారణంగా రెగ్యూలర్‌గా అతడికి జట్టులో చోటు దక్కేది కాదు. కానీ 2018-19 రంజీ సీజన్‌లో తన సత్తా ఎంటో క్రికెట్ ప్రపంచానికి ముఖేష్ తెలియజేశాడు. ఆ సీజన్‌లో కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు పడగొట్టి.. బెంగాల్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్ తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడలేదు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 39 మ్యాచ్‌లు ఆడిన అతడు 149 వికెట్లు పడగొట్టాడు.
భారత జట్టు నుంచి పిలుపు
దేశీవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండడంతో అతడికి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. కానీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. అనంతరం శ్రీలంకతో సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం చోటుదక్కలేదు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో మాత్రం అతడికి అదృష్టం వరించింది.
ఐపీఎల్-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా కూడా ఎంపికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment