భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం రెస్ట్‌లో ఉంది. అనంతరం సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు బారత జట్టు ఎంపిక బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది.
ముఖ్యంగా పేస్ బౌలర్లను ఎంపిక చేయడంలో భారత సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉండనున్నాడు. మరోవైపు ప్రీమియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఈ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు.
ఈ క్రమంలో బంగ్లాతో టెస్టుల్లో భారత పేస్ ఎటాక్‌ను హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అయితే సిరాజ్‌తో కలిసి ఎవరు బంతిని పంచుకుంటారన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్‌కు బంగ్లాతో సిరీస్ సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది.
చివరగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భారత జట్టులో ముఖేష్ భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన అతడు 7 వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించాడు.
ఆకాష్ దీప్‌కు ఛాన్స్...?
అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు మరో బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌కు కూడా ఛాన్స్ దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జార్ఖండ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టుతో అరంగేట్రం చేసిన ఆకాష్.. తన తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు.
మూడు వికెట్లు పడగొట్టి తన అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్‌కు బుమ్రా తిరిగి రావడంతో దీప్ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ తన అద్భుత బౌలింగ్‌తో సెలక్టర్ల దృష్టిని మాత్రం ఆకాష్ ఆకర్షించాడు. ఇప్పుడు బుమ్రా పూర్తిగా సిరీస్‌కు దూరం కానుండడంతో ఆకాష్‌కు మరోసారి చోటు దక్కే అవకాశముంది.
అర్ష్‌దీప్ అరంగేట్రం?
మరోవైపు ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. అతడికి వైట్‌బాల్ ఫార్మాట్‌లో కూడా భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment