Bangladesh Vs India
-
India vs Bangladesh, 2nd Test: విజయం వేటలో... మెరుపు వేగంతో...
తొలి మూడు రోజుల ఆటలో రెండు రోజులు ఒక్క బంతి కూడా పడలేదు. మొదటి రోజు కూడా 35 ఓవర్లకే ఆట పరిమితమైంది. ఇలాంటి స్థితిలో మిగిలిన రెండు రోజుల్లో ‘డ్రా’కే అవకాశం తప్ప మరో ఫలితం వస్తుందా అని సోమవారం ఉదయం అంతా ఊహించారు. కానీ భారత జట్టు మాత్రం భిన్నంగా ఆలోచించింది. మ్యాచ్‌లో ఆధిక్యం ప్రదర్శించి విజయంపై గురి పెట్టాలంటే అసాధారణంగా ఆడాలని నిశ్చయించుకుంది. బ్యాటర్లంతా ఒక్కసారిగా టి20 ఫార్మాట్‌కు మారిపోయారు. అంతే... 50, 100, 150, 200, 250... ఇలా అన్ని పరుగుల మైలురాళ్లను వేగంగా, తక్కువ బంతుల్లో అధిగమించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. రోహిత్‌తో మొదలు పెట్టి జైస్వాల్, గిల్, కోహ్లి, రాహుల్ ధాటిగా ఆడటంతో ఏకంగా 8.22 రన్‌రేట్‌తో భారీగా పరుగులు, ఆపై ఆధిక్యం కూడా వచ్చేశాయి. అనంతరం 45 నిమిషాల్లోనే బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టి రెండు వికెట్లతో పైచేయి సాధించింది. చివరి రోజు బంగ్లా పోరాడుతుందా లేక భారత్ ఇదే ఊపులో మ్యాచ్ గెలిచేస్తుందా చూడాలి. కాన్పూర్: వర్షంతో వృథా అయిన సమయాన్ని మర్చిపోయేలా గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత జట్టు అభిమానులకు ఒక్క రోజులో పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మెరుపు బ్యాటింగ్‌తో జట్టు సత్తా చాటింది. సోమవారం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్‌కు 52 పరుగుల ఆధిక్యం లభించింది. యశస్వి జైస్వాల్ (51 బంతుల్లో 72; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (43 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) విరాట్ కోహ్లి (35 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (36 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించగా... షకీబ్, మిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 26 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఉదయం 107/3తో ఆట కొనసాగించిన బంగ్లా తమ తొలి ఇన్నింగ్స్‌లో 74.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్) కీలక సెంచరీ సాధించారు. సోమవారం ఒక్కరోజే 18 వికెట్లు నేలకూలడం విశేషం. మోమినుల్ మినహా... రెండు రోజుల పాటు మైదానానికి దూరంగా ఉన్న తర్వాత ఎట్టకేలకు 107/3 స్కోరుతో బంగ్లాదేశ్ తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. సోమవారం మరో 39.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 126 పరుగులు జోడించి మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఆరంభం నుంచే ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ముష్ఫికర్ (11)ను బౌల్డ్ చేసి బంగ్లా పతనానికి బుమ్రా శ్రీకారం చుట్టాడు. బుమ్రా తర్వాతి ఓవర్లో దాస్ మూడు ఫోర్లు కొట్టి జోరు ప్రదర్శించినా... రోహిత్ అద్భుత క్యాచ్‌తో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్‌లో మోమినుల్ మాత్రం పట్టుదలగా నిలబడి పరుగులు సాధించాడు. కొద్ది సేపటికే సిరాజ్ అసాధారణ క్యాచ్ షకీబ్ (9)ను పెవిలియన్ పంపించింది. 93, 95 పరుగుల వద్ద పంత్, కోహ్లి క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన మోమినుల్ ఆ తర్వాత కెరీర్లో 13వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత మిగిలిన 4 వికెట్లను పడగొట్టేందుకు భారత్ కు ఎక్కువ సమయం పట్టలేదు. ఖాలెద్‌ను అవుట్ చేసి జడేజా తన ఖాతాలో 300వ వికెట్‌ను వేసుకున్నాడు. ధనాధన్... దూకుడే మంత్రంగా భారత్ ఇన్నింగ్స్ సాగింది. మహమూద్ వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 3 వరుస ఫోర్లు బాదగా... ఖాలెద్ వేసిన తర్వాతి ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతులను రోహిత్ శర్మ (11 బంతుల్లో 23; 1 ఫోర్, 3 సిక్స్‌లు) సిక్సర్లుగా మలిచాడు. అనంతరం మహమూద్ ఓవర్లో వీరిద్దరు 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 22 పరుగులు రాబట్టారు. అయితే నాలుగో ఓవర్లోనే స్పిన్నర్ మిరాజ్ బౌలింగ్ కు దిగి రోహిత్‌ను వెనక్కి పంపాడు. 31 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. మరో వైపు గిల్ కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో 32 పరుగుల వ్యవధిలో జైస్వాల్, గిల్, పంత్ (9) అవుటయ్యారు. ఈ దశలో కోహ్లి, రాహుల్ జోరు తగ్గకుండా బంగ్లా బౌలర్లపై ఆధిక్యం ప్రదర్శించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 59 బంతుల్లోనే 87 పరుగులు జోడించడం విశేషం. 33 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకోగా, కోహ్లి ఆ అవకాశం చేజార్చుకున్నాడు. షకీబ్ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో ఆకాశ్‌దీప్ కూడా తానూ ఓ చేయి వేశాడు. 16 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం 11 ఓవర్లపాటు క్రీజ్‌లో బంగ్లా బ్యాటర్లు తడబడుతూనే ఆడారు. 7 ఓవర్లలో జట్టు 18 పరుగులు చేసింది. అయితే తర్వాతి ఓవర్ తొలి బంతికే జాకీర్ (10)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్... తన తర్వాతి ఓవర్లో నైట్‌వాచ్‌మన్ మహమూద్ (4)ను బౌల్డ్ చేసి బంగ్లా ఆందోళనను మరింత పెంచాడు. అంతకుముందు 3 పరుగుల వద్ద షాద్మన్ ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్ వదిలేశాడు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: జాకీర్ (సి) జైస్వాల్ (బి) ఆకాశ్‌దీప్ 0; షాద్మన్ (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్ 24; మోమినుల్ (నాటౌట్) 107; నజ్ముల్ (ఎల్బీ) (బి) అశి్వన్ 31; ముష్ఫికర్ (బి) బుమ్రా 11; లిటన్ దాస్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; షకీబ్ (సి) సిరాజ్ (బి) అశి్వన్ 9; మిరాజ్ (సి) గిల్ (బి) బుమ్రా 20; తైజుల్ (బి) బుమ్రా 5; మహమూద్ (ఎల్బీ) (బి) సిరాజ్ 1; ఖాలెద్ (సి అండ్ బి) జడేజా 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 233. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–80, 4–112, 5–148, 6–170, 7–224, 8–230, 9–231, 10–233. బౌలింగ్: బుమ్రా 18–7–50–3, సిరాజ్ 17–2–57–2, అశి్వన్ 15–1–45–2, ఆకాశ్‌దీప్ 15–6–43–2, జడేజా 9.2–0–28–1. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) మహమూద్ 72; రోహిత్ (బి) మిరాజ్ 23; గిల్ (సి) మహమూద్ (బి) షకీబ్ 39; పంత్ (సి) మహమూద్ (బి) షకీబ్ 9; కోహ్లి (బి) షకీబ్ 47; రాహుల్ (స్టంప్డ్) దాస్ (బి) మిరాజ్ 68; జడేజా (సి) నజు్మల్ (బి) మిరాజ్ 8; అశ్విన్ (బి) షకీబ్ 1; ఆకాశ్‌దీప్ (సి) ఖాలెద్ (బి) మిరాజ్ 12; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (34.4 ఓవర్లలో 9 వికెట్లకు డిక్లేర్డ్) 285. వికెట్ల పతనం: 1–55, 2–127, 3–141, 4–159, 5–246, 6–269, 7–272, 8–284, 9–285. బౌలింగ్: మహమూద్ 6–0–66–1, ఖాలెద్ 4–0–43–0, మిరాజ్ 6.4–0–41–4, తైజుల్ 7–0–54–0, షకీబ్ 11–0–78–4. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మన్ (బ్యాటింగ్) 7; జాకీర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 10; మహమూద్ (బి) అశ్విన్ 4; మోమినుల్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (11 ఓవర్లలో 2 వికెట్లకు) 26. వికెట్ల పతనం: 1–18, 2–26. బౌలింగ్: బుమ్రా 3–1–3–0, అశి్వన్ 5–2–14–2, ఆకాశ్‌దీప్ 3–2–4–0.4: మూడు ఫార్మాట్లో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ (34,357), సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483) ఈ జాబితాలో అతనికంటే ముందున్నారు. కోహ్లి ప్రస్తుతం 27,012 పరుగులు చేశాడు. -
IND vs BAN: బుమ్రా, షమీ దూరం! ఆ ఇద్దరికీ లక్కీ ఛాన్స్?
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం రెస్ట్‌లో ఉంది. అనంతరం సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు బారత జట్టు ఎంపిక బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది.ముఖ్యంగా పేస్ బౌలర్లను ఎంపిక చేయడంలో భారత సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉండనున్నాడు. మరోవైపు ప్రీమియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో టెస్టుల్లో భారత పేస్ ఎటాక్‌ను హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అయితే సిరాజ్‌తో కలిసి ఎవరు బంతిని పంచుకుంటారన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్‌కు బంగ్లాతో సిరీస్ సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది. చివరగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భారత జట్టులో ముఖేష్ భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన అతడు 7 వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించాడు.ఆకాష్ దీప్‌కు ఛాన్స్...?అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు మరో బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌కు కూడా ఛాన్స్ దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జార్ఖండ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టుతో అరంగేట్రం చేసిన ఆకాష్.. తన తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి తన అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్‌కు బుమ్రా తిరిగి రావడంతో దీప్ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ తన అద్భుత బౌలింగ్‌తో సెలక్టర్ల దృష్టిని మాత్రం ఆకాష్ ఆకర్షించాడు. ఇప్పుడు బుమ్రా పూర్తిగా సిరీస్‌కు దూరం కానుండడంతో ఆకాష్‌కు మరోసారి చోటు దక్కే అవకాశముంది.అర్ష్‌దీప్ అరంగేట్రం?మరోవైపు ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. అతడికి వైట్‌బాల్ ఫార్మాట్లో కూడా భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. -
చరిత్ర సృష్టించిన లిటన్ దాస్.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. 16 ఏళ్ల రికార్డు బద్దలు
Bangladesh vs Ireland, 2nd T20I: బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతంగా అర్ధ శతకం పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఐర్లాండ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు. 16 ఏళ్ల రికార్డు బద్దలు చట్టోగ్రామ్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా 18 బంతుల్లో 50 పరుగులు మార్కును అందుకున్నాడు. తద్వారా మహ్మద్ అష్రాఫుల్ పేరిట ఉన్న రికార్డును లిటన్ దాస్ బద్దలు కొట్టాడు. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆష్రాఫుల్ 20 బంతులో హాఫ్ సెంచరీ చేశాడు. జొహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ ఘనత సాధించాడు 41 బంతుల్లో ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్లో టీమిండియాతో మ్యాచ్‌లో 21 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని.. ఆష్రాఫుల్ తర్వాతి స్థానంలో నిలిచాడు లిటన్ దాస్. తాజా మ్యాచ్‌తో అతడిని అధిగమించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇక ఐర్లాండ్‌తో రెండో టీ20లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న లిటన్ దాస్ 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 83 పరుగులు చేశాడు. లిటన్ దాస్‌కు తోడు మరో ఓపెనర్ రోనీ టాలూక్దర్ 44 పరుగులతో రాణించగా.. 202 పరుగుల భారీ స్కోరు చేసింది బంగ్లాదేశ్. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో బంగ్లా గెలుపొందింది. చదవండి: Rashid Khan: వరల్డ్ నంబర్ 1 రషీద్! పాక్‌పై చెలరేగి టాప్-3లో అతడు.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఖుషీ David Warner: సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని! ఈసారి.. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచ కప్ తుది సమరానికి తెరలేచింది. డిఫెండింగ్ చాంపియన్ ‘యువ’భారత్ తొలిసారి అండర్–19 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆఖరి పోరులో టాస్ పడింది. బంగ్లా యువ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు టీమిండియా బరిలోకి దిగుతుండగా.. ఈ సువర్ణావకాశాన్ని వదులుకోరాదని బంగ్లాదేశ్ పట్టుదలగా ఉంది. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం ఇక్కడ భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఐసీసీ సోమవారాన్ని ‘రిజర్వ్ డే’గా పెట్టింది. ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచిన ఇరు జట్లూ.. బలాబలాలపరంగా చూస్తే దాదాపుగా సమ ఉజ్జీలుగా ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్లను భారత్ ఓడిస్తే... దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లను బంగ్లాదేశ్ చిత్తు చేసింది. (చదవండి : 'ఫైనల్లో బంగ్లాదేశ్‌ను కుమ్మేయండి') తుది జట్లు : ఇండియా అండర్-19 : యశస్వి జైస్వాల్, దివ్యాన్ష్ సక్సేనా, తిలక్ వర్మ, ప్రియం గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సిద్ధేష్ వీర్, అధర్వ అంకోలేకర్, రవి బిష్ణోయ్, శశ్వత్ రావత్, కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్ బంగ్లాదేశ్ అండర్-19 : పర్వేజ్ హుస్సేన్, టాంజిద్ హసన్, మహ్మద్ఉల్ హసన్, తోహిద్ హ్రిదోయ్, షాహదత్ హుస్సేన్, అవిషేక్ దాస్, అక్బర్ అలీ (కెప్టెన్/వికెట్ కీపర్), షమీమ్ హుస్సేన్, రాకిబుల్ హసన్, షోరిఫుల్ ఇస్లాం, టాంజిమ్ హసన్ షకీబ్ -
బంగ్లాదేశ్ క్రికెటర్లకు వాంతులు!
న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం టీమిండియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్‌లో ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇబ్బంది పడినట్టు వెల్లడైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన బంగ్లా సీనియర్ బ్యాట్స్‌మన్ సౌమ్య సర్కార్, మరో ఆటగాడు వాంతులు చేసుకున్నట్టు ‘ఈఎస్పీఎన్’ వెల్లడించింది. ఆందోళనలు పట్టించుకోకుండా ఢిల్లీలో మ్యాచ్ నిర్వహించడంతో బీసీసీఐపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరినప్పటికీ బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో రద్దు చేయడం కుదరదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చిచెప్పారు. కాలుష్యాన్ని లెక్కచేయకుండా క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన రెండు జట్లను మ్యాచ్ ముగిసిన తర్వాత ట్విటర్ ద్వారా ఆయన అభినందించారు. అయితే ఢిల్లీ కాలుష్యం తనను ఇబ్బంది పెట్టలేదని కీలక ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీం తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈ వాయు కాలుష్యం నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. నేను ఎవరి బౌలింగ్‌లో ఆడుతున్నా అనే దానిపైనే దృష్టి పెట్టాను. అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి మేము ఇక్కడకు వచ్చాం కాబట్టి మిగతా విషయాలను పట్టించుకోమ’ని అతడు పేర్కొన్నాడు. భారత్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. (చదవండి: అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్) -
టీ20: భారత్‌పై బంగ్లా విజయం
పేలవమైన బ్యాటింగ్, పదును లేని బౌలింగ్ వెరసి భారత్ తొలిసారి టి20ల్లో బంగ్లాదేశ్ చేతిలో భంగపడింది. రాజధానిలో తీవ్రమైన కాలుష్యం మధ్యే సాగిన మొదటి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. తొమ్మిదో ప్రయత్నంలో తొలిసారి భారత్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి సగర్వంగా నిలిచింది. షకీబ్, తమీమ్‌లాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఆ జట్టు ప్రదర్శించిన స్ఫూర్తిదాయక ఆటతో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఏ దశలోనూ బ్యాటింగ్‌లో దూకుడు కనబర్చని రోహిత్ సేన ఆ తర్వాత ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలమైంది. సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ ఈ సారి అత్యుత్సాహం ప్రదర్శించకుండా చివరి వరకు నిలిచి తన జట్టును గెలిపించడం విశేషం. రోహిత్ ఇప్పటికే చెప్పినట్లు ఆ జట్టు విజయం ఇక ఏమాత్రం ‘సంచలనం’ కాదు! న్యూఢిల్లీ: భారత పర్యటనలో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. స్కోరు సమమైనపుడు కెప్టెన్ మహ్ముదుల్లా సిక్సర్‌తో బంగ్లాదేశ్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. ముష్ఫికర్ రహీమ్ (43 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) మూడో వికెట్‌కు 55 బంతుల్లో 60 పరుగులు జోడించి విజయంలో కీలక పాత్ర పోషించారు. సిరీస్‌లో బంగ్లా 1–0తో ఆధిక్యంలో నిలవగా... రెండో మ్యాచ్ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. రోహిత్ విఫలం... తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ (9) వెనుదిరగడం భారత్ భారీ స్కోరు అవకాశాలను దెబ్బ తీసింది. షఫీయుల్ ఇస్లామ్ వేసిన ఈ ఓవర్ తొలి, నాలుగో బంతులకు ఫోర్లు కొట్టిన అతను చివరి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అవుట్ ప్రకటించాక రోహిత్ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. ధావన్ పరుగులు చేసినా... భారత ఇన్నింగ్స్‌లో ధావన్ టాప్ స్కోరర్ గా నిలిచినా... అతని బ్యాటింగ్ ఏమాత్రం టి20 స్థాయికి తగినట్లుగా సాగలేదు. తాను ఎదుర్కొన్న 13వ బంతికి గానీ అతను ఫోర్ కొట్టలేకపోయాడు. ఇన్నింగ్స్ ఏ దశలోనూ శిఖర్ ఇన్నింగ్స్ స్ట్రయిక్‌రేట్ ఒక్కసారి కూడా 100కు మించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పంత్‌తో సమన్వయ లోపంతో అతని ఆట ముగిసింది. అందరూ అంతంతే... కోహ్లి గైర్హాజరులో మూడో స్థానంలో అవకాశం దక్కించుకున్న లోకేశ్ రాహుల్ (15) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), రిషభ్ పంత్ (26 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేదు. కెరీర్లో తొలి మ్యాచ్ శివమ్ దూబే (1)కు కలిసి రాలేదు. కృనాల్ పాండ్యా (8 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), సుందర్ (5 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపుల కారణంగా చివరి 2 ఓవర్లలో భారత్ 30 పరుగులు రాబట్టింది. ఫలితంగా కొంత గౌరవప్రదమైన స్కోరు వద్ద ముగించగలిగింది. కీలక భాగస్వామ్యం... సాధారణ లక్ష్య ఛేదనలో బంగ్లా తొలి ఓవర్లోనే లిటన్ దాస్ (7) వికెట్ కోల్పోయింది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న నయీమ్ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), సర్కార్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 45 పరుగులకు చేరింది. అయితే చహల్ తన తొలి ఓవర్లోనే నయీమ్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత సర్కార్, ముష్ఫికర్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముష్ఫికర్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు చహల్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీని తిరస్కరించగా భారత్ రివ్యూ చేయలేదు. రీప్లేలో అది అవుటయ్యేదని తేలింది! అదే ఓవర్ చివరి బంతికి అవకాశం లేని చోట సమీక్ష కోరి భారత్ రివ్యూ కోల్పోయింది. సర్కార్‌ను ఖలీల్ బౌల్డ్ చేయడంతో బంగ్లా మూడో వికెట్ కోల్పోయింది. అయితే ముష్ఫికర్, మహ్ముదుల్లా (15 నాటౌట్) కలిసి జట్టును గెలుపు తీరం చేర్చారు. ధావన్ బ్యాట్ మారింది... సుదీర్ఘకాలంగా తన బ్యాట్‌పై ‘ఎంఆర్ఎఫ్’ స్టికర్ వాడిన ధావన్ కాంట్రాక్ట్ ముగిసినట్లుంది. అందుకే ఈ మ్యాచ్‌లో కొత్తగా ‘కూకాబుర్రా’ బ్యాట్‌తో ఆడాడు. ఆస్ట్రేలియా కంపెనీ కూకాబుర్రాకు చెందిన బ్యాట్‌ను ఒక భారత క్రికెటర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో వాడటం ఇదే తొలిసారి. 4,4,4,4 గెలుపు కోసం బంగ్లా చివరి 18 బంతుల్లో 35 పరుగులు చేయాలి. వికెట్లు చేతిలో ఉన్నా ఒత్తిడిలో అది అంత సులువు కాదు. అయితే 18వ ఓవర్లో ముష్ఫికర్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను బౌండరీ వద్ద కృనాల్ నేలపాలు చేసి వారికి మరో అవకాశం ఇచ్చాడు. ఖలీల్ వేసిన 19వ ఓవర్లో ముష్ఫికర్ చెలరేగిపోయాడు. వరుసగా 4, 4, 4, 4 బాది గెలుపునకు చేరువగా తీసుకొచ్చాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) షఫీయుల్ 9; ధావన్ (రనౌట్) 41; రాహుల్ (సి) మహ్మదుల్లా (బి) అమీనుల్ 15; అయ్యర్ (సి) నయీమ్ (బి) అమీనుల్ 22; పంత్ (సి) నయీమ్ (బి) షఫీయుల్ 27; దూబే (సి అండ్ బి) అఫీఫ్ 1; కృనాల్ (నాటౌట్) 15; సుందర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–10, 2–36, 3–70, 4–95, 5–102, 6–120. బౌలింగ్: షఫీయుల్ 4–0–36–2, అమీన్ 4–0–27–0, ముస్తఫిజుర్ 2–0–15–0, అమీనుల్ 3–0– 22–2, సర్కార్ 2–0–16–0, అఫీఫ్ 3–0– 11–1, మొసద్దిక్ 1–0–8–0, మహ్మదుల్లా 1–0–10–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) రాహుల్ (బి) చహర్ 7; నయీమ్ (సి) ధావన్ (బి) చహల్ 26; సౌమ్య సర్కార్ (బి) ఖలీల్ 39; ముష్ఫికర్ (నాటౌట్) 60; మహ్ముదుల్లా (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–8, 2–54, 3–114. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–24–1, వాషింగ్టన్ సుందర్ 4–0–25–0, ఖలీల్ అహ్మద్ 4–0–37–1, యజువేంద్ర చహల్ 4–0–24–1, కృనాల్ పాండ్యా 4–0–32–0, దూబే 0.3–0–9–0. -
బంగ్లాతో టీ20 : టీమిండియా 148
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి 20లో టీమిండియా 6 వికెట్లకు148 పరుగులు చేసింది. వచ్చీ రావడంతోనే రెండు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించిన ఓపెనర్ రోహిత్ శర్మ (4 బంతుల్లో 9 పరుగులు ; రెండు ఫోర్లు) అదే ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. షఫీవుల్ బౌలింగ్‌లో రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ (13 బంతుల్లో 22; 1 పోర్, 2 సిక్స్), రిషభ్ పంత్ (26 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఫరవాలేదనిపించారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో ప్రత్యర్థికి 149 లక్ష్యాన్ని నిర్దేశించింది. మంచి ప్రదర్శన చేస్తున్న ధావన్ రనౌట్ కావడం టీమిండియాను ఇబ్బందుల్లో పడేసింది. షఫీవుల్ ఇస్లాం, అమీనుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు తీశారు. అఫీఫ్ హొసేన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
టీ20 : తొలి వికెట్ కోల్పోయిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్, టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి సమరం ప్రారంభమైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కోహ్లి గైర్హాజరులో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. తొలి ఓవర్లోనే టీమిండియా వికెట్ కోల్పోయింది. వచ్చీ రావడంతోనే రెండు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించిన ఓపెనర్ రోహిత్ శర్మ (4 బంతుల్లో 9 పరుగులు ; రెండు ఫోర్లు) అదే ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. షఫీవుల్ బౌలింగ్‌లో రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తుది జట్ల వివరాలు భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్, పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్. బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్యా సర్కార్, మొహమ్మద్ నయీమ్, ముష్ఫికర్ రహీం (వికెట్ కీపర్), అఫీఫ్ హొసేన్, అమీనుల్ ఇస్లాం, షఫీవుల్ ఇస్లాం, మొసద్దిక్ హొసేన్, ముస్తఫిజుర్ రహమాన్, అల్ అమీన్ హొసేన్ -
అచ్చం ధోనీలా హెలికాఫ్టర్ షాట్!
ఓవల్: చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా సత్తాచాటింది. అయితే నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 240 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ధనా ధన్ ఇన్నింగ్స్‌కు అందరూ దాసోహమయ్యారు. కేవలం 54 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 80 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన ఎంపిక సరైనదేనని నిరూపించాడు. అయితే పాండ్యా సిక్సర్లు కొట్టిన తీరు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని గుర్తుకు తెప్పించిందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఇన్నింగ్స్ చివరి బంతిని హార్దిక్ అద్బుతమైన సిక్సర్‌గా మలిచాడు. రుబెల్ హుస్సేన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ధోనీ తరహాలో హెలికాఫ్టర్ షాట్ ఆడాడని పాండ్యాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ.. మాపై ఏ ఒత్తిడి లేదు. అత్యుత్తమ క్రికెట్‌ను ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు. భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 23.5 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలడంతో 240 పరుగుల భారీ విజయం దక్కింది. భువనేశ్వర్ (3/13), ఉమేశ్ (3/16) లతో పాటు బ్యాటింగ్‌లో దినేశ్ కార్తీక్ (94 రిటైర్డ్ అవుట్), శిఖర్ ధావన్ (60) రాణించారు.