
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి 20లో టీమిండియా 6 వికెట్లకు148 పరుగులు చేసింది. వచ్చీ రావడంతోనే రెండు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించిన ఓపెనర్ రోహిత్ శర్మ (4 బంతుల్లో 9 పరుగులు ; రెండు ఫోర్లు) అదే ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. షఫీవుల్ బౌలింగ్‌లో రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ (13 బంతుల్లో 22; 1 పోర్, 2 సిక్స్), రిషభ్ పంత్ (26 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఫరవాలేదనిపించారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో ప్రత్యర్థికి 149 లక్ష్యాన్ని నిర్దేశించింది. మంచి ప్రదర్శన చేస్తున్న ధావన్ రనౌట్ కావడం టీమిండియాను ఇబ్బందుల్లో పడేసింది. షఫీవుల్ ఇస్లాం, అమీనుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు తీశారు. అఫీఫ్ హొసేన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment