భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నవంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా గడ్డపై జరుగనున్న ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు. టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ ముందుండి నడిపించనుండగా.. దక్షిణాఫ్రికాకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహించనున్నాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపికైన భారత్ జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేశ్ ఖాన్, యశ్ దయాల్
భారత్‌తో టీ20లో సిరీస్‌లో తలపడే దక్షిణాఫ్రికా జట్టు..
ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, గెరాల్డ్ కొయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ ఎంపోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, ఆండిల్ సిమెమెలన్, ట్రిస్టన్ స్టబ్స్, లుథే సిపామ్లా
షెడ్యూల్..
నవంబర్ 8- తొలి టీ20 (డర్బన్)
నవంబర్ 10- రెండో టీ20 (గ్వెబెర్హా)
నవంబర్ 13- మూడో టీ20 (సెంచూరియన్)
నవంబర్ 15- నాలుగో టీ20 (జొహనెస్‌బర్గ్)
మ్యాచ్ టైమింగ్స్..
ఈ సిరీస్‌లోని నాలుగు మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ సిరీస్‌ను టీవీల్లో స్పోర్ట్స్ 18 ఛానళ్లలో వీక్షించవచ్చు. ఆన్‌లైన్‌లో చూడాలనుకుంటే జియో సినిమాలో ఉచితంగా చూడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment