
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్, టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి సమరం ప్రారంభమైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కోహ్లి గైర్హాజరులో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. తొలి ఓవర్‌లోనే టీమిండియా వికెట్ కోల్పోయింది. వచ్చీ రావడంతోనే రెండు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించిన ఓపెనర్ రోహిత్ శర్మ (4 బంతుల్లో 9 పరుగులు ; రెండు ఫోర్లు) అదే ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. షఫీవుల్ బౌలింగ్‌లో రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
తుది జట్ల వివరాలు
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్, పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్.
బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్యా సర్కార్, మొహమ్మద్ నయీమ్, ముష్ఫికర్ రహీం (వికెట్ కీపర్), అఫీఫ్ హొసేన్, అమీనుల్ ఇస్లాం, షఫీవుల్ ఇస్లాం, మొసద్దిక్ హొసేన్, ముస్తఫిజుర్ రహమాన్, అల్ అమీన్ హొసేన్
Comments
Please login to add a commentAdd a comment