స్వదేశంలో వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. లక్నో వేదికగా ఫిబ్రవరి 24 నుంచి శ్రీలంక- భారత్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక శ్రీలంకతో తొలి టీ20కు మందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. గురువారం జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో 36 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. తొలి స్ధానంలో 3299 పరుగులతో న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ ఉండగా, రెండో స్ధానంలో 3,296 పరుగులతో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లి ఉన్నాడు.
ఇక భారత్- శ్రీలంక తొలి టీ20 విషయానికి వస్తే.. స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్‌లు విరాట్ కోహ్లి, పంత్‌లకు విశ్రాంతి ఇవ్వగా.. రాహుల్, వాషింగ్టన్ సుందర్ గాయాల కారణంగా దూరమయ్యారు. ఇక గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి చేరనున్నాడు. కాగా ఇరు జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచుల్లో తలపడగా.. భారత్ 14, శ్రీలంక 7 విజయాలు సాధించాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే స్వదేశంలో శ్రీలంకపై భారత్ పూర్తి అధిపత్యం చెలాయించింది. ఇప్పటి వరకు స్వదేశంలో భారత్ మ్యాచ్‌ల్లో గెలవగా.. శ్రీలంక కేవలం రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
చదవండి: Ind Vs Sl 1st T20: అప్పుడు భారత్ భారీ స్కోరు.. రోహిత్ సెంచరీ.. మరి ఈసారి ఏం జరుగనుందో!
Comments
Please login to add a commentAdd a comment