
Bangladesh vs Ireland, 2nd T20I: బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతంగా అర్ధ శతకం పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఐర్లాండ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు.
16 ఏళ్ల రికార్డు బద్దలు
చట్టోగ్రామ్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా 18 బంతుల్లో 50 పరుగులు మార్కును అందుకున్నాడు. తద్వారా మహ్మద్ అష్రాఫుల్ పేరిట ఉన్న రికార్డును లిటన్ దాస్ బద్దలు కొట్టాడు. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆష్రాఫుల్ 20 బంతులో హాఫ్ సెంచరీ చేశాడు. జొహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ ఘనత సాధించాడు
41 బంతుల్లో
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్లో టీమిండియాతో మ్యాచ్‌లో 21 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని.. ఆష్రాఫుల్ తర్వాతి స్థానంలో నిలిచాడు లిటన్ దాస్. తాజా మ్యాచ్‌తో అతడిని అధిగమించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇక ఐర్లాండ్‌తో రెండో టీ20లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న లిటన్ దాస్ 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 83 పరుగులు చేశాడు.
లిటన్ దాస్‌కు తోడు మరో ఓపెనర్ రోనీ టాలూక్దర్ 44 పరుగులతో రాణించగా.. 202 పరుగుల భారీ స్కోరు చేసింది బంగ్లాదేశ్. వర్షం కారణంగా 17 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో బంగ్లా గెలుపొందింది.
చదవండి: Rashid Khan: వరల్డ్ నంబర్ 1 రషీద్! పాక్‌పై చెలరేగి టాప్-3లో అతడు.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఖుషీ
David Warner: సన్‌రైజర్స్‌ది తెలివి తక్కువతనం.. అందుకే వార్నర్‌ను వదులుకుని! ఈసారి..