మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎ జట్టు బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 223 పరుగులకు ఆలౌటైంది. 52/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ అదనంగా 171 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.
దీంతో కంగారులకు మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో మార్కస్ హ్యారీస్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కోరీ రోకిసియోలి(35),పీర్సన్(30) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు పడగొట్టగా, ముఖేష్ కుమార్ మూడు, ఖాలీల్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించారు.
ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం..
అంతకుముందు భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్(80) మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో నీసర్ 4 వికెట్లు పడగొట్టగా, వెబ్‌స్టెర్ మూడు వికెట్లు సాధించాడు.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..
Comments
Please login to add a commentAdd a comment