PC: AFP
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20కు టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ దూరమయ్యాడు. తన పెళ్లి కారణంగా మూడో టీ20కు ముందు ముఖేష్‌ను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది.
ఇక అతడి స్ధానాన్ని మరో యువ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ బీసీసీఐ భర్తీ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించింది. అయితే రాయ్‌పూర్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు ముందు అతడు జట్టుతో కలవనున్నాడు.
ముఖేష్ జట్టులోకి వచ్చినప్పటికీ చాహర్ కూడా జట్టులో కొనసాగనున్నాడు. "గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగే మూడో టీ20కి ముందు టీమిండియా నుంచి తనను విడుదల చేయాలని ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ బీసీసీఐని అభ్యర్థించాడు.
ముఖేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో అతడికి సెలవు మంజూరు చేయబడింది. అతడి స్ధానంలో దీపక్ చాహర్ జట్టుతో చేరాడు. ముఖేష్ తిరిగి రాయ్‌పూర్‌లో జరిగే 4వ టీ20కి ముందు జట్టులో చేరనున్నాడని" బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా దీపక్ చాహర్ చివరగా గతేడాది దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున ఆడాడు.
చదవండి: సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! తొందరపడి ముందే ఎందుకు
Update: Fast bowler Mukesh Kumar made a request to BCCI to be released from India’s squad ahead of the third T20I against Australia in Guwahati. Mukesh is getting married and has been granted leave for the duration of his wedding festivities.
— BCCI (@BCCI) November 28, 2023
He will join the squad ahead of the…
Comments
Please login to add a commentAdd a comment