
టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ ఓ ఇంటివాడయ్యాడు. బీహార్‌కు చెందిన తన చిన్ననాటి స్నేహితురాలు దివ్య సింగ్‌ను ముఖేష్ వివాహమాడాడు. వీరిద్దరి పెళ్లి గోరఖ్‌పూర్‌లో ఓ హోటల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. వీరి వివాహనికి పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. డిసెంబర్ 4న గోరఖ్‌పూర్‌లో ముఖేష్-దివ్య వివాహ రిసెప్షన్ జరగనుంది.
ఈ క్రమంలోనే మంగళవారం గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20కు ముఖేష్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని మూడో టీ20 ఆరంభానికి ముందు బీసీసీఐ వెల్లడించింది. ముఖేష్ తిరిగి మళ్లీ శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు ముందు జట్టుతో కలవనున్నాడు. తొలి రెండు టీ20ల్లో ముఖేష్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శరన కనబరిచాడు.
కాగా ముఖేష్ కుమార్ ఏడాదిలోనే టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలోనూ అరేంగ్రం చేయడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్ పర్యటనలో వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముఖేష్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 వేలంలో అతడిని రూ. 5 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment