బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) తన అద్బుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులోనూ బుమ్రా సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను మరోసారి దెబ్బతీశాడు.
అయితే గాయం కారణంగా బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. తొడ కండరాల పట్టేయడంతో ఆట మధ్యలోనే బుమ్రా మైదానాన్ని వీడాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
46 ఏళ్ల రికార్డు బద్దలు..
ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బుమ్రా ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ పేరిట ఉండేది.
1977/78 సీజన్‌లో ఆసీస్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో బేడీ 31 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో బేడీ 46 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
చదవండి: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
Comments
Please login to add a commentAdd a comment