సిడ్నీ టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టాండింగ్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. రెండో రోజు ఆటలో బుమ్రా తొడ కండరాలు పట్టేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.
అంతేకాకుండా ప్రాక్టీస్ జెర్సీ ధరించి స్కానింగ్ కోసం సిబ్బందితో కలిసి స్కానింగ్ కోసం ఆస్పత్రికి జస్ప్రీత్ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో భారత అభిమానుల ఆందోళన నెలకొంది.
ఒకవేళ స్కానింగ్ రిపోర్ట్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలితే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అతడి గైర్హజరీలో విరాట్ కోహ్లి స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెండో రోజు ఆట ఆరంభంలోనే లబుషేన్ వికెట్ పడగొట్టి భారత్‌కు బుమ్రా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.
ఆసీస్ 181కు ఆలౌట్..
ఇక సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక ఆసీస్ బ్యాటర్లలో వెబ్‌స్టర్(57) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(33), సామ్ కొన్‌స్టాస్(23) పరుగులతో రాణించారు. అంతకుముందు టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
Comments
Please login to add a commentAdd a comment