సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) వైదొలగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫామ్ లేమి కారణంగా రోహిత్ తనంతటతానే తప్పుకున్నాడని స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా టాస్ సమయంలో చెప్పుకొచ్చాడు.
అయినప్పటికి జట్టు మెనెజ్‌మెంట్ కావాలనే రోహిత్‌పై వేటు వేసిందని, సిడ్నీ టెస్టు తర్వాత అతడు రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. స్వచ్ఛందంగా తనంతట తనే తప్పుకున్నాని రెండో రోజు లంచ్ సమయంలో బ్రాడ్‌క్రాస్టర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పుకొచ్చాడు.
బ్రాడ్ కాస్టర్లు: రోహిత్ మీరు సిడ్నీ టెస్టుకు దూరంగా ఉండడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీరు విశ్రాంతి తీసుకున్నారని కొన్ని రిపోర్టులు చెబుతుండగా.. మరి కొన్ని నివేదికలు మిమ్మల్ని జట్టు నుంచి తప్పించారని పేర్కొంటున్నాయి. ఇందులో ఏది నిజం?
రోహిత్ శర్మ: నన్ను జట్టు నుంచి తప్పించారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఇది పూర్తిగా నా సొంత నిర్ణయమే. ప్రస్తుతం నేను పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాను. నేను ఫామ్‌లో కూడా లేను. ఫామ్‌లో లేని ఆటగాళ్లు జట్టుకు భారం కాకుడదు.
సిడ్నీ టెస్టు మాకు చాలా కీలకం. కాబట్టి ఇన్ ఫామ్ బ్యాటర్‌కు అవకాశమివ్వాలనుకున్నాను.ఇదే విషయం కోచ్, చీఫ్ సెలెక్టర్‌తో చర్చించాను. ఆ తర్వాతే జట్టును ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. అదే విధంగా తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై కూడా హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు.
"ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నంత మాత్రాన నేను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు కాదు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ ఆలోచన నా మనసులో లేదు. ప్రస్తుతం పరుగులు సాధించడానికి ఇబ్బంది పడుతున్నా. అంతమాత్రాన ఎప్పటికి ఇదే ఫామ్ కొనసాగదు కాదా? తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తాన్న నమ్మకం నాకు ఉంది .అంతే తప్ప ఎవరో బయట కూర్చోని నా రిటైర్మెంట్‌ను డిసైడ్ చేయలేరు. నేను ఇద్దరి పిల్లల తండ్రిని, స్వంతంగా నా నిర్ఱయాలు తీసుకోగలను" అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment