ముఖేష్ కుమార్ సూప‌ర్ డెలివ‌రీ.. జైశ్వాల్ షాక్‌! వీడియో వైర‌ల్‌ | Mukesh Kumar Send Off For Jaiswal As He Supports His Off Stump | Sakshi
Sakshi News home page

IPL 2024: ముఖేష్ కుమార్ సూప‌ర్ డెలివ‌రీ.. జైశ్వాల్ షాక్‌! వీడియో వైర‌ల్‌

Published Thu, Mar 28 2024 8:36 PM | Last Updated on Thu, Mar 28 2024 8:39 PM

Mukesh Kumar Send Off For Jaiswal As He Supports His Off Stump - Sakshi

ఐపీఎల్‌-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఈవెంట్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఢిల్లీ పేస‌ర్ ముఖేష్ కుమార్ అద్భుతమైన బంతితో జైశ్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

రాజ‌స్తాన్ ఇన్నింగ్స్ 2 ఓవ‌ర్ బౌలింగ్ చేసేందుకు డీసీ కెప్టెన్ రిష‌బ్ పంత్‌..  ముఖేష్ కుమార్‌ను ఎటాక్‌లోకి తీసుకువ‌చ్చాడు. ఈ క్ర‌మంలో ఆ ఓవ‌ర్‌లో రెండో బంతిని జైశ్వాల్ ఫోర్‌గా మ‌లిచాడు. ఆ త‌ర్వాతి రెండు బంతుల‌కు ఎటువంటి ప‌రుగులు రాలేదు. అయితే ఐదో బంతిని అద్భుతమైన ఫుల్-లెంగ్త్ డెలివరీగా ముఖేష్ సంధించాడు.

ఈ క్ర‌మంలో జైశ్వాల్ ఫ్లిక్ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించ‌గా.. బంతి మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో ఒక్క‌సారిగా ముఖేష్ బిత్త‌ర‌పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement