టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. భారత టెస్ట్ జట్టు భవిష్యత్తు స్టార్ పేసర్లుగా ముగ్గురు పేర్లను ప్రకటించాడు. ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు మున్ముందు టీమిండియా టెస్ట్ బౌలర్లు స్థిరపడతారని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురిని సాన పడితే టీమిండియా తరఫున అద్భుతాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. వీరిలో ముకేశ్ కుమార్‌పై మరింత ఫోకస్ పెడితే ప్రపంచంలోకెళ్లా మేటి బౌలర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు.
ముకేశ్ కుమార్‌కు సరైన గైడెన్స్ ఇస్తే అతను ఏం చేయగలడో గమనించానని చెప్పిన ఇషాంత్.. తన ఢిల్లీ క్యాపటిల్స్ సహచర బౌలర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముకేశ్ లాంటి అతి సాధారణ వ్యక్తిని తాను చూడలేదని, అతనిని ఫలానా డెలివరీ వేయమని అడిగితే, ఖచ్చితంగా అది వేయగల సమర్ధత అతని దగ్గరుందని అన్నాడు. ఒత్తిడిలో సైతం ముకేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, అలాంటి సమయాల్లో అతను బంతిని నియంత్రణలో ఉంచుకోగలడని తెలిపాడు.
ఉమ్రాన్, అర్షదీప్‌ల విషయానికొస్తే.. వీరిని కొద్దిగా సానబడితే చాలా కాలం పాటు టీమిండియాకు సేవలందించగలరని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ ముగ్గురిని టెస్ట్ క్రికెట్ కోసం ప్రిపేర్ చేస్తే భారత పేస్ దళానికి మరో ఐదారేళ్ల పాటు ఢోకా ఉండదని అన్నాడు. ఈ విషయాలన్నిటినీ ఇషాంత్ రణ్‌వీర్ అలహాబాదియా యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో విశ్లేషించాడు.
ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్, వన్డే జట్లలో ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు దక్కించుకున్నారు. ఉమ్రాన్ కేవలం వన్డే జట్టుకు ఎంపిక కాగా.. ముకేశ్ కుమార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. సెలెక్టర్లు మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి మరీ ముకేశ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. విండీస్ పర్యటనలో మహ్మద్ సిరాజ్ ఆధ్వర్యంలో జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీలతో కూడిన టెస్ట్ జట్టులో ముకేశ్ సభ్యుడిగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment