ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత తరుపున వన్డేల్లో యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేశారు. అదే విధంగా టీ20 సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్‌కు తొలి వన్డేలో భారత తుది జట్టులో చోటు దక్కింది.
ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ పేసర్ మాట్ హెన్రీ తిరిగి పునరాగమనం చేశాడు. కాగా ఈ వన్డే సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో ధావన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్
చదవండి: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్య భాయ్ బోణీ శతకం ఖాయమేనా..?
Comments
Please login to add a commentAdd a comment