పుణే వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో శనివారం రాజ్‌కోట్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి.
అయితే కీలకమైన మూడో టీ20లో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో టీ20లో దారుణంగా విఫలమైన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో పేసర్ ముఖేష్ కుమార్ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.
అదే విధంగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన యువ ఓపెనర్ శుబ్‌మాన్ గిల్ స్థానంలో రుత్‌రాజ్ గైక్వాడ్.. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని టీమిండియా మేనేజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన రాహుల్ త్రిపాఠిని మూడో టీ20లో కూడా కొనసాగించే అవకాశం ఉంది.
భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం మావి, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
చదవండి: Hardik Pandya: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్.. ఇప్పుడు హార్దిక్ ఎందుకిలా చేస్తున్నారు? డీకే స్ట్రాంగ్ రిప్లై
Comments
Please login to add a commentAdd a comment