సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్, ఎలక్ట్రానిక్ మీడియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పృథ్విరాజ్ మెమోరియల్ మీడియా 6 ఎ సైడ్ క్రికెట్ టోర్నీలో సాక్షి టీవీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది.
మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో సాక్షి టీవీ 4 వికెట్ల తేడాతో 6 టీవీపై గెలిచింది. సీతారామ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టివీ 9, టీవీ 1, టీవీ 5, టి న్యూస్, మీడియా క్లబ్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. టోర్నీని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ పి.ఎన్.రావు ప్రారంభించారు. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
క్వార్టర్‌ఫైనల్స్‌లో సాక్షి టీవీ
Published Tue, Mar 11 2014 11:44 PM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM
Advertisement
Advertisement