
మోహన్‌బాబు, శరత్‌కుమార్
సీనియర్ నటులు మంచు మోహన్‌బాబు, శరత్‌కుమార్ ‘కన్నప్ప’ మూవీ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది.
హీరో ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు మంచు మోహన్‌బాబు, శరత్ కుమార్ ‘కన్నప్ప’లో భాగమైనట్లు ప్రకటించి, వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment