శిఖర్ ధావన్‌ను అవుట్ చేశాక శార్దుల్ ఉత్సాహం
ముంబై: కీలకమైన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగులతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఐపీఎల్ టోర్నీలో ముందడుగు వేసింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్ష్(48 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, అర్ష్దీప్ సింగ్, లివింగ్‌స్టోన్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. జితేశ్ శర్మ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (4/36) పంజాబ్‌ను దెబ్బ తీయగా, అక్షర్, కుల్దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వార్నర్ (0) నిరాశపరచగా... సర్ఫరాజ్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నది కాసేపే అయినా ధనాధన్‌గా ఆడేశాడు. మిచెల్ మార్ష్ఆరంభంలో భారీ సిక్సర్లు బాదినా... తర్వాత వికెట్లు కూలడంతో బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లో (2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. మిగతా వారిలో లలిత్ యాదవ్ (24) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు.
కింగ్స్ విలవిల
మొదట ఢిల్లీ పేస్‌కు తలవంచిన పంజాబ్ టాపార్డర్... తర్వాత స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడింది. 3.4 ఓవర్ల వరకు 38 స్కోరుతో దూకుడుగా సాగిపోతున్న పంజాబ్‌కు తర్వాతి బంతి నుంచి కష్టాలెదురయ్యాయి. ధాటిగా ఆడిన బెయిర్‌స్టో (15 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్)ను నోర్జే పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (19), రాజపక్స (4)లను శార్దుల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు అక్షర్ , కుల్దీప్ తిప్పేయడంతో పంజాబ్ లక్ష్యానికి దూరమై ఓటమికి దగ్గరైంది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) చహర్ (బి) లివింగ్‌స్టోన్ 0; సర్ఫరాజ్ (సి) చహర్ (బి) అర్ష్దీప్ 32; మార్ష్(సి) రిషి ధావన్ (బి) రబడ 63; లలిత్ (సి) రాజపక్స (బి) అర్ష్దీప్ 24; పంత్ (స్టంప్డ్) జితేశ్ (బి) లివింగ్‌స్టోన్ 7; పావెల్ (సి) శిఖర్ (బి) లివింగ్‌స్టోన్ 2; అక్షర్ (నాటౌట్) 17; శార్దుల్ (సి) హర్‌ప్రీత్ (బి) అర్ష్దీప్ 3; కుల్దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159.
వికెట్ల పతనం: 1–0, 2–51, 3–98, 4–107, 5–112, 6–149,7–154.
బౌలింగ్: లివింగ్‌స్టోన్ 4–0–27–3, రబడ 3–0–24 –1, హర్‌ప్రీత్ 3–0–29–0, రిషి «2–0–17–0, అర్ష్దీప్ 4–0–37–3, చహర్ 4–0–19–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) అక్షర్ (బి) నోర్జే 28; శిఖర్ (సి) పంత్ (బి) శార్దుల్ 19; రాజపక్స (సి) నోర్జే (బి) శార్దుల్ 4; లివింగ్‌స్టోన్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 3; మయాంక్ (బి) అక్షర్ 0; జితేశ్ (సి) వార్నర్ (బి) శార్దుల్ 44; హర్‌ప్రీత్ (బి) కుల్దీప్ 1; రిషి ధావన్ (బి) అక్షర్ 4; చహర్ (నాటౌట్) 25; రబడ (సి) పావెల్ (బి) శార్దుల్ 6; అర్ష్దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1–38, 2–53, 3–54, 4–55, 5–61, 6–67, 7–82, 8–123, 9–131.
బౌలింగ్: ఖలీల్ 4–0– 43–0, నోర్జే 4–0–29–1, లలిత్ 1–0–6–0, శార్దుల్ ఠాకూర్ 4–0–36–4, అక్షర్ పటేల్ 4–0–14–2, కుల్దీప్ యాదవ్ 3–0–14–2.
ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్ హైదరాబాద్ X ముంబై ఇండియన్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచిస్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
Comments
Please login to add a commentAdd a comment