
Courtesy: IPL Twitter
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కా�...
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2 మెయిన్స్ ప�...
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫై...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్�...
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్�...
నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్త...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రిత�...
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మ...
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమ�...
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర�...
Published Mon, May 16 2022 6:57 PM | Last Updated on Mon, May 16 2022 11:24 PM
Courtesy: IPL Twitter
IPL 2022: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ లైవ్ అప్డేట్స్
పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 142 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బ్యాటర్లలో జితేష్ శర్మ(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు, అక్షర్ పటేల్ ,కుల్ధీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు, నోర్జే ఒక్క వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక పంజాబ్ బౌలర్లలో లియామ్ లివింగ్‌స్టోన్, ఆర్షదీప్ సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక్క వికెట్ సాధించాడు.
123 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన జితీష్ శర్మ.. ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
17 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 121/7, క్రీజులో జితీష్ శర్మ(43), రాహుల్ చాహర్(16)పరుగులతో ఉన్నారు. పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 39 పరుగులు కావాలి
15 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 101/7, క్రీజులో జితీష్ శర్మ(36), రాహుల్ చాహర్(3) పరుగులతో ఉన్నారు.
82 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఏడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రిషి ధావన్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 89/7
67 పరుగులకే 6 వికెట్లు పంజాబ్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 12 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 80/6
61 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. స్టంపౌటయ్యాడు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 66/5
55 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ క్లీన్ బౌల్డయ్యాడు.
ఒకే ఓవర్లో పంజాబ్ కింగ్స్ రెండు వికెట్లు కోల్పోయింది. 6 ఓవర్ వేసిన శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో.. రాజపాక్స, ధావన్ ఔటయ్యారు.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన బెయిర్ స్టో.. నోర్జే బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో ధావన్(18), రాజపాక్స ఉన్నారు. 5 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 44/1
2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్ స్టో(11) ధావన్(3) పరుగులతో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక పంజాబ్ బౌలర్లలో లియామ్ లివింగ్‌స్టోన్, ఆర్షదీప్ సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక్క వికెట్ సాధించాడు.
150 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన మిచెల్ మార్ష్..రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 152/6
107 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన పంత్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 109/4
98 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 24 పరగులు చేసిన లలిత్ యాదవ్ ఆర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
8 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్: 74/2,క్రీజులో మిచెల్ మార్ష్(29), లలిత్ యాదవ్(12) పరుగులతో ఉన్నారు.
51 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్.. ఆర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
నాలుగు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(26), మిచెల్ మార్ష్(19) క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బంతికే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో వార్నర్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుకా రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్
డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment