
Courtesy: IPL Twitter
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడిగా రికార్డులకెక్కారు. ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో వీరిద్దరూ 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
డికాక్ కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు సాధించగా.. రాహుల్ 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ నమోదు చేసిన 181 పరుగలు ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును వీరిద్దరూ బ్రేక్ చేశారు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఏ వికెట్‌కైనా ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం గమనార్హం.
చదవండి: Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరిన నిఖత్ జరీన్
Comments
Please login to add a commentAdd a comment