pc: ipl.com
ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో హార్ధిక్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ సరికొత్త రికార్డు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో ఫెర్గూసన్ ఏకంగా గంటకు కు 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన తొలి బౌలర్‌గా ఫెర్గూసన్ నిలిచాడు. అంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డెలివరీ(157 .కి.మీ వేగం) రికార్డును ఫెర్గూసన్ బద్దలు కొట్టాడు.
చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి'
Comments
Please login to add a commentAdd a comment