IPL 2022 Auction: Jofra Archer Back in IPL Auction for 2 Crore Base Price - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: వేలంలోకి అత‌డు వ‌చ్చేశాడు.. రికార్డులు బ‌ద్ద‌లు అవ్వాల్సిందే!

Published Tue, Feb 1 2022 3:04 PM | Last Updated on Tue, Feb 1 2022 6:23 PM

Jofra Archer back in IPL Auction for 2 Crore Base Price - Sakshi

ఐపీఎల్‌లో ఇంగ్లండ్ స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి పున‌రాగమ‌నం చేయ‌నున్నాడు. ఐపీఎల్‌-2022 సీజ‌న్ మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్ రూ. 2 కోట్ల బేస్ ధరగా త‌న పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది  ఐపీఎల్‌లో గాయం కార‌ణంగా ఆర్చర్ పాల్గొనడం అనుమానమేనని బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలిపింది. 2023,2024 ఐపీఎల్ సీజ‌న్ల‌లో ఆర్చ‌ర్‌ పాల్గొనే అవకాశం ఉన్నందున ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అత‌డి పేరును నమోదు చేసింది.

కాగా ఆర్చ‌ర్ గ‌త కొన్ని సీజ‌న్ల నుంచి రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలం ముందు ఆర్చ‌ర్‌ని  రాజ‌స్తాన్ రాయ‌ల్స్ రీటైన్ చేసుకోలేదు. ఇక‌ అర్చ‌ర్‌తో పాటు మ‌రో 44 మంది ఆట‌గాళ్లు పేర్లును కొత్తగా రిజిస్ట‌ర్ చేసుకున్నార‌ని బీసీసీఐ పేర్కొంది. దీంట్లో ఆసీస్ స్టార్ ఆట‌గాడు ఖవాజా కూడా ఉన్నాడు. ఈ వేలంలో మొత్తం 1258 ఆట‌గాళ్లు త‌మ పేర్లును న‌మోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 13వ‌ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా వేలాన్ని బీసీసీఐ నిర్వ‌హించనుంది.

చ‌ద‌వండి: IPL 2022: ఆ డబ్బుతో మొదట ఐఫోన్‌, సెకండ్‌ హాండ్‌ కారు కొన్నా.. అందులో ఏసీ లేదు: సిరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement