ఐపీఎల్-2022 మెగా వేలం పక్రియ ఇప్పటికే పూర్తి అయింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. మరో వైపు ఈ లక్నో, అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది సీజన్ మరింత రసవత్తరంగా జరగనుంది. ఇక ఐపీఎల్-2022 షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరు చూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, ముంబై, పూణేలోని 6 స్టేడియాల్లో జరిగే అవకాశం ఉంది. మ్యాచ్‌లు మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియాల్లో జరిగే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఈ స్టేడియాలను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ సిద్దం చేసినట్లు వినికిడి. అదే విధంగా ఒక వేళ మార్చి 26న టోర్నీ ప్రారంభమైతే.. ప్రసారం చేయడానికి బ్రాడ్‌కాస్టర్ డిస్నీ స్టార్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Yash Dhull: చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు!
Comments
Please login to add a commentAdd a comment