Wankhede Cricket Ground
-
ఆసీస్‌ను ఓడించాం
ముంబై: సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఎట్టకేలకు పదకొండో ప్రయత్నంలో ఆ్రస్టేలియా మహిళల జట్టుపై భారత జట్టు తొలిసారి టెస్టు విజయాన్ని అందుకుంది. ఇక్కడి వాంఖెడె మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన నాలుగు రోజుల ఏకైక టెస్టులో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సమష్టిగా ఆడితే ఎంతటి మేటి జట్టునైనా ఓడించవచ్చని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం నిరూపించింది. ఆ్రస్టేలియా నిర్దేశించిన 75 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 18.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పటిష్టమైన ఇంగ్లండ్‌తో గత ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వారం తిరిగేలోపు మరో మేటి జట్టు ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ ఏడాదిని దిగ్విజయంగా ముగించింది. రాణించిన స్నేహ్, రాజేశ్వరి ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 233/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా కేవలం 28 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 261 పరుగుల వద్ద ఆలౌటైంది. యాష్లే గార్డ్నర్ (7)ను ఆట రెండో ఓవర్లోనే పూజ వస్త్రకర్ వికెట్లముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్ పతనం మొదలైంది. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన అనాబెల్ సదర్లాండ్ (102 బంతుల్లో 27; 3 ఫోర్లు)ను...అలానా కింగ్ (0)ను వరుస బంతుల్లో స్నేహ్ రాణా అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. చివరి రెండు వికెట్లను రాజేశ్వరి గైక్వాడ్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 261 పరుగులవద్ద ముగిసింది. 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే దెబ్బ పడింది. షఫాలీ వర్మ (4) నాలుగో బంతికి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత రిచా ఘోష్ (32 బంతుల్లో 13; 3 ఫోర్లు)తో కలిసి స్మృతి మంధాన (61 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించింది. రిచా అవుటయ్యాక జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు)తో కలిసి స్మృతి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 219; భారత్ తొలి ఇన్నింగ్స్: 406; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: బెత్ మూనీ (రనౌట్) 33; లిచ్‌ఫెల్డ్ (బి) స్నేహ్ రాణా 18; ఎలీస్ పెరీ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 45; తాలియా మెక్‌గ్రాత్ (బి) హర్మన్‌ప్రీత్ 73; అలీసా హీలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్మన్‌ప్రీత్ 32; అనాబెల్ సదర్లాండ్ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 27; యాష్లే గార్డ్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) పూజ 7; జెస్ జొనాసెన్ (బి) రాజేశ్వరి 9; అలానా కింగ్ (బి) స్నేహ్ రాణా 0; కిమ్ గార్త్ (బి) రాజేశ్వరి 4; లారెన్ చీట్లె (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–49, 2–56, 3–140, 4–206, 5–221, 6–233, 7–251, 8–251, 9–260, 10–261. బౌలింగ్: రేణుక 11–4–32–0, పూజ వస్త్రకర్ 11–1–40–1, స్నేహ్ రాణా 22–5–66–4, దీప్తి శర్మ 22–7– 35–0, రాజేశ్వరి గైక్వాడ్ 28.4–11 –42–2, జెమీమా 2–0–13–0, హర్మన్‌ప్రీత్ 9–0–23–2. భారత్ రెండో ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అలీసా (బి) గార్త్ 4; స్మృతి మంధాన (నాటౌట్) 38; రిచా ఘోష్ (సి) తాలియా (బి) గార్డ్నర్ 13; జెమీమా (నాటౌట్)12; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.4 ఓవర్లలో రెండు వికెట్లకు) 75. వికెట్ల పతనం: 1–4, 2–55. బౌలింగ్: కిమ్ గార్త్ 5–1–19–1, యాష్లే గార్డ్నర్ 9–2–18–1, తాలియా 2–0–14–0, జెస్ జొనాసెన్ 2.4–0–16–0. 7: ఓవరాల్‌గా టెస్టు ఫార్మాట్లో భారత మహిళల జట్టు గెలిచిన టెస్టుల సంఖ్య. 1976 నుంచి 2023 వరకు భారత జట్టు 40 టెస్టులు ఆడింది. ఇందులో ఏడింటిలో గెలిచి, ఆరింటిలో ఓడిపోయింది. మిగతా 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 11: ఆస్ట్రేలియా జట్టుతో 1977 నుంచి 2023 మధ్యకాలంలో భారత్ 11 టెస్టులు ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ్రస్టేలియా చేతిలో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి, ఆరింటిని ‘డ్రా’ చేసుకుంది. 2: స్వదేశంలో భారత జట్టు ఒకే ఏడాది రెండు టెస్టుల్లో గెలవడం ఇదే తొలిసారి. భారత్ నెగ్గిన ఏడు టెస్టుల్లో నాలుగు స్వదేశంలో, మూడు విదేశీ గడ్డపై వచ్చాయి. హర్మన్‌ప్రీత్ కెపె్టన్సీలో భారత జట్టు ఆడిన రెండు టెస్టుల్లోనూ నెగ్గడం విశేషం. 9: గత 17 ఏళ్లలో భారత జట్టు తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో ఒక టెస్టులో ఓడి, ఐదు టెస్టుల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. -
బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్.. ఫలితం తారుమారు కాకుండా!
India vs Sri Lanka, 1st T20I- Umran Malik: శ్రీలంకతో తొలి టీ20లో టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అరంగేట్రంలో అదరగొట్టిన బౌలర్ శివం మావి(4 వికెట్లు)కి తోడుగా రెండు వికెట్లతో రాణించాడు. వాంఖడే మ్యాచ్‌లో తన బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఉమ్రాన్.. మొత్తంగా 27 పరుగులు ఇచ్చాడు. చరిత్ అసలంక(12), లంక కెప్టెన్ దసున్ షనక(45) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, షనకను అవుట్ చేసే క్రమంలో ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ విసిరిన బంతి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ బాల్‌గా నిలిచింది. పదిహేడో ఓవర్లో ఉమ్రాన్ వేసిన నాలుగో బంతిని ఎక్స్ట్రా కవర్ ఆడే దిశగా ఆడేందుకు షనక ప్రయత్నించాడు. అయితే, మనోడి ఎక్స్ ట్రా పేస్ కారణంగా అతడి ప్రయత్నం ఫలించలేదు. ఫాస్టెస్ట్ బాల్ చహల్ క్యాచ్ అందుకోవడంతో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షనక నిష్క్రమించాల్సి వచ్చింది. ఇంతకీ ఉమ్రాన్ వేసిన బంతి స్పీడ్ ఎంతంటే గంటకు 155 కిలోమీటర్లు(155kph). ఈ స్పీడ్‌స్టర్ నైపుణ్యం చూసిన కెప్టెన్, పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చిరునవ్వుతో అతడిని మైదానంలోనే అభినందించాడు. నిజానికి లంక టాప్ స్కోరర్‌గా ఉన్న షనకను అవుట్ చేయకపోతే ఫలితం తారుమారయ్యే అవకాశం లేకపోలేదు! కాగా ఈ మ్యాచ్ సందర్భంగా అత్యంత వేగంగా బంతిని విసిరిన ఉమ్రాన్.. జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును కనుమరుగు చేశాడు. బుమ్రా రికార్డు బద్దలు బుమ్రా గతంలో 153.36 kmph స్పీడ్‌తో బౌలింగ్ చేయగా.. మహ్మద్ షమీ(153.3 kmph), నవదీప్ సైనీ (152.85 kmph) అతడి తర్వాతి స్థానాల్లో ఉండేవాళ్లు. ఇప్పుడు వీళ్లందరిని ఉమ్రాన్ వెనక్కినెట్టాడు. టీమిండియా పేసర్లలో ఫాస్టెస్ట్ బాల్ విసిరిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఉమ్రాన్.. పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే నువ్వు రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ను కూడా అధిగమిస్తావు అంటూ ఫ్యాన్స్ ఉమ్రాన్ పేరును ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! ఎందుకో తెలుసా? Pele: బరువెక్కిన హృదయంతో బోరున విలపిస్తూ.. అంతిమ వీడ్కోలు.. పీలే అంత్యక్రియలు పూర్తి Umran Malik on Fire🔥 Umran malik took wicket of Dashun Shanaka by bowling at 155 Km.. OMG! #UmranMalik #INDvSL pic.twitter.com/yqVeADBUxV — NAFISH AHMAD (@nafeesahmad497) January 3, 2023 That's that from the 1st T20I.#TeamIndia win by 2 runs and take a 1-0 lead in the series. Scorecard - https://t.co/uth38CaxaP #INDvSL @mastercardindia pic.twitter.com/BEU4ICTc3Y — BCCI (@BCCI) January 3, 2023 -
ఐపీఎల్-2022 తొలి మ్యాచ్ ఆ జట్ల మధ్యే..!
ఐపీఎల్-2022 మార్చి 26న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. కాగా ఐపీఎల్ 15 వ సీజన్ లీగ్ మ్యాచ్‌లు మొత్తం మూడు మైదానాల్లో జరగనున్నాయి. ఇప్పటికే 10 జట్లతో ఐపీఎల్ కొత్త తరహా షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనున్నట్లు తెలుస్తోంది. సీఎస్కే గ్రూపు-బిలో ఉండగా.. కేకేఆర్ గ్రూపు- ఎలో ఉంది. అయితే లీగ్ దశలో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే తలపడతాయి. ఐపీఎల్-2022 సీజన్లో జట్లను రెండు రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎ లో ఐదు జట్లు, గ్రూపు-బి లో ఐదు జట్లును చేర్చారు. ఏ గ్రూప్‌లో ఎవరు ఉన్నారంటే? గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్ చదవండి: Women’s World Cup 2022: ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు షాక్.. స్టార్ ఓపెనర్ తలకు గాయం! -
ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే!
ఐపీఎల్-2022 మెగా వేలం పక్రియ ఇప్పటికే పూర్తి అయింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. మరో వైపు ఈ లక్నో, అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది సీజన్ మరింత రసవత్తరంగా జరగనుంది. ఇక ఐపీఎల్-2022 షెడ్యూల్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరు చూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, ముంబై, పూణేలోని 6 స్టేడియాల్లో జరిగే అవకాశం ఉంది. మ్యాచ్‌లు మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియాల్లో జరిగే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే ఈ స్టేడియాలను ముంబై క్రికెట్ ఆసోసియేషన్ సిద్దం చేసినట్లు వినికిడి. అదే విధంగా ఒక వేళ మార్చి 26న టోర్నీ ప్రారంభమైతే.. ప్రసారం చేయడానికి బ్రాడ్‌కాస్టర్ డిస్నీ స్టార్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Yash Dhull: చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు! -
15 నిమిషాల కోసం 5 కోట్లు!
ముంబై : పద్మావత్ సినిమా విజయంతో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీగా ప్రేక్షకులను అలరించిన రణ్వీర్ ప్రస్తుతం గల్లీ బాయ్, టెంపర్ రీమేక్ సింబా, '83 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్ 2018 ప్రారంభ వేడుకల్లో పలువురు బాలీవుడ్ నటులు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రణ్వీర్ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే కేవలం 15 నిమిషాల పాటు సాగనున్న ప్రదర్శనకు ఏకంగా రూ. 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట నిర్వాహకులు. రణ్‌వీర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా భారీ మొత్తం చెల్లించేందుకు కూడా వారు వెనకాడటం లేదని ఓ జాతీయ చానెల్ పేర్కొంది. ప్రస్తుతం గల్లీ బాయ్ షూటింగ్లో ఉన్న రణ్వీర్ సింగ్ డాన్స్ రిహార్సల్ కోసం విరామం తీసుకున్నాడట. ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుకల్లో రణ్వీర్తో పాటు.. పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్‌లు కూడా ప్రదర్శన ఇవ్వబోతున్నారు. -
షారుఖ్ ఖాన్‌పై నిషేధం ఎత్తివేత
- చవాన్‌కు మద్దతు నిరాకరణ - ఎంసీఏ ప్రకటన ముంబై: వాంఖడే క్రికెట్ మైదానంలో ప్రవేశంపై బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌పై మూడేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎత్తివేసింది. 2012 ఐపీఎల్లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుఖ్... స్టేడియం భద్రతా అధికారితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన ఎంసీఏ అతడిని స్టేడియంలోకి అనుమతించకుండా నిషేధం విధించింది. ఇక స్పాట్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ చేత జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న ముంబై క్రికెటర్ అంకిత్ చవాన్‌కు తాము ఎలాంటి మద్దతు ఇవ్వదలుచుకోలేదని షెలార్ చెప్పారు.