
PC: IPL
ఐపీఎల్-2022 మార్చి 26న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. కాగా ఐపీఎల్ 15 వ సీజన్ లీగ్ మ్యాచ్‌లు మొత్తం మూడు మైదానాల్లో జరగనున్నాయి. ఇప్పటికే 10 జట్లతో ఐపీఎల్ కొత్త తరహా షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.
ఇక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనున్నట్లు తెలుస్తోంది. సీఎస్‌కే గ్రూపు-బిలో ఉండగా.. కేకేఆర్ గ్రూపు- ఎలో ఉంది. అయితే లీగ్ దశలో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే తలపడతాయి. ఐపీఎల్-2022 సీజన్‌లో జట్లను రెండు రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎ లో ఐదు జట్లు, గ్రూపు-బి లో ఐదు జట్లును చేర్చారు.
ఏ గ్రూప్‌లో ఎవరు ఉన్నారంటే?
గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్
గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్
చదవండి: Women’s World Cup 2022: ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు షాక్.. స్టార్ ఓపెనర్ తలకు గాయం!
Comments
Please login to add a commentAdd a comment