ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం అసన్నమైంది. ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా మెగావేలం జరగనుంది. ఇక ఈసారి రెండు కొత్త జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. మొత్తం ఈ ఏడాది లీగ్ కోసం 1,214 మంది క్రికెటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే రానున్న మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తలు మొదలపెట్టాయి. ఈ క్రమంలో అండర్-19 ప్రపంచ కప్‌లో అదరగొడుతున్న భారత యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువన్షీ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది.
ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రఘువన్షీ 228 పరుగులు చేశాడు. దీంట్లో ఒక అర్ధసెంచరీతో పాటు, సెంచరీ కూడా ఉంది. అదే విధంగా అండర్-19 ఆసియా కప్‌లో కూడా రఘువన్షీ అధ్బుతంగా రాణించాడు. దీంతో అతడితో పాటు ఆల్‌రౌండర్ రాజ్ బావాను కూడా ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజ్ బావా బ్యాట్‌తోను, బాల్‌తోను ఈ మెగా టోర్నమెంట్‌లో రాణిస్తున్నాడు. ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రాజ్ బావా 162 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
చదవండి: SA vs IND 3rd ODI: 'కెప్టెన్‌గా అతడు ఏం చేశాడో నాకు తెలియడం లేదు'
Comments
Please login to add a commentAdd a comment