
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. ఇప్పటికే 8 జట్లు తమ రీటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అదే విధంగా ఐపీఎల్‌లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్,అహ్మదాబాద్ టైటన్స్ కూడా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఈ మెగా వేలాన్ని ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా బీసీసీఐ నిర్వహించనుంది. ఇక రాయల్ ఛాలెంజర్ప్ బెంగళూరు విషయానికి వస్తే.. ఆ జట్టు వేలానికి ముందు విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను రీటైన్ చేసుకుంది. కాగా గత ఏడాది సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రానున్న మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను దక్కించుకోవడం కోసం ఆర్సీబీ భారీ మొత్తాన్ని ఫిక్స్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా అతడితో పాటు అంబటి రాయుడు, రియాన్ పరాగ్‌లపై ఆర్సీబీ కన్నేసినట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్ప్ బెంగళూరు ఇంకా తమ పర్స్‌లో ఇంకా అత్యధికంగా 57 కోట్లను కలిగి ఉన్నారు. అయితే దీంట్లో హోల్డర్‌కి 12 కోట్లు, అంబటి రాయుడుకి 8 కోట్లు, రియాన్ పరాగ్‌కి 7 కోట్లు ఆర్సీబీ కెటాయించనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ఆటగాళ్లపై దాదాపు రూ.27 కోట్లు ఖర్చు చేస్తే.. ఆర్‌సీబీ పర్సులో ఇంకా రూ.28 కోట్లు మిగలనున్నాయి ఇక వేలంలో జాసన్ హోల్డర్‌ను సొంతం చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ భావిస్తోన్నట్లు సమాచారం.
చదవండి: Hardik Pandya: కీలక టోర్నీ నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment