టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పని అయిపోయింది, ఇక భారత జట్టులో చోటు కష్టమే, అతడి స్ధానంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వండి. ఇవన్నీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వినిపించిన మాటలు ఇవి. అయితే పడి లేచిన కెరటంలా ధావన్ దక్షిణాఫ్రికా టూర్‌లో అద్భుతంగా రాణించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 169 పరుగులు సాధించాడు. దీంట్లో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సిరీస్‌లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు.
కాగా గత ఏడాది శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించాడు. టీ20 ప్రపంచకప్-2021, స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ధావన్‌కు చోటు దక్క లేదన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ధావన్‌ని రీటైన్ చేసుకోలేదు. ఆ క్రమంలో రానున్న మెగా వేలంలో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన గబ్బర్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు తప్పక పోటీ పడతాయనడంలో సందేహం లేదు.. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనుంది.
చదవండి: Virat Kohli- Vamika: వామిక ఫొటోలు వైరల్.. స్పందించిన కోహ్లి...
Comments
Please login to add a commentAdd a comment