IPL 2022: ఐపీఎల్-2022 మెగా వేలాన్ని ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఇక రానున్న మెగా వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ను దక్కించుకోనేందుకు మూడు జట్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది సీజన్ల నుంచి కమిన్స్ కేకేఆర్ జట్టుకు ప్రతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు కేకేఆర్ అతడిని రీటైన్ చేసుకోలేదు. దీంతో ఈ వేలంలో అతడిని సొంతం చేసుకోనేందుకు ముంబై ఇండియన్స్,ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పాట్ కమిన్స్‌ను పంజాబ్ కింగ్స్ ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
అంతే కాకుండా జట్టు సారథ్య బాధ్యతలు కూడా అప్పజెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా వేలంకు ముందు పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్‌ను రీటైన్ చేసుకోలేదు. పంజాబ్.. మయాంక్ ఆగర్వాల్, హర్షల్ పటేల్‌ను రీటైన్ చేసుకుంది. అయితే మయాంక్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పనున్నారని వార్తలు వినిపించాయి. మయాంక్ ఆగర్వాల్‌కు కెప్టెన్‌గా పూర్తిగా అనుభవం లేకపోవడంతో పంజాబ్ కింగ్స్ మేనేజెమెంట్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా అద్భుత విజయం సాధించిన పాట్ కమిన్స్‌కి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని పంజాబ్ కింగ్స్ మేనేజెమెంట్ భావిస్తోన్నట్లు సమాచారం.
చదవండి: IND Vs WI 1st ODI: మళ్లీ విఫలమైన కోహ్లి.. అయితేనేం సచిన్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment