IPL 2024 PBKS vs SRH Live Updates:
పంజాబ్ కింగ్స్‌తో ఆఖరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఉనద్కట్ వేసిన ఆఖరి ఓవర్‌లో తమ విజయానికి 29 పరుగులు అవసరమవ్వగా పంజాబ్ బ్యాటర్లు అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ 26 పరుగులు సాధించారు.
ఆఖరి వరకు పోరాడనప్పటికి తన జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్(46) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అశుతోష్ శర్మ(15 బంతుల్లో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, నటరాజన్, నితీష్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 64 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
19 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్
18 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ : 154/6. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 29 పరుగులు కావాలి.
పంజాబ్ ఆరో వికెట్ డౌన్..
జితేష్ శర్మ రూపంలో పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది.19 పరుగులు చేసిన జితేష్.. నితీష్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 116/6
ఐదో వికెట్ డౌన్..
91 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన సికిందర్ రజా.. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 97/5
నాలుగో వికెట్ డౌన్
58 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శశాంక్ సింగ్ వచ్చాడు.
9 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 58/3
9 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో సామ్ కుర్రాన్(29), సికిందర్ రజా(10) పరుగులతో ఉన్నారు.
కష్టాల్లో పంజాబ్.. 20 పరుగులకే 3 వికెట్లు
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శిఖర్ ధావన్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ధావన్ ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో డకౌటయ్యాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 2/1
పంజాబ్ టార్గెట్ 183 పరుగులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్‌ఆర్‌హెచ్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు అబ్దుల్ సమాద్(25), షాబాజ్ ఆహ్మద్(14) ఆఖరిలో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు సామ్ కుర్రాన్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఎస్‌ఆర్‌హెచ్ ఏడో వికెట్ డౌన్..
నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 64 పరుగులు చేసిన నితీష్ కుమార్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ : 156/8
ఎస్‌ఆర్‌హెచ్ ఆరో వికెట్ డౌన్..
అబ్దుల్ సమాద్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అబ్దుల్ సమాద్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16.4 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ : 133/6
నితీష్ కుమార్ ఫిప్టీ..
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందున్నాడు. 63 పరుగులతో నితీష్ కుమార్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 15 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ : 133/5
ఐదో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్
హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన క్లాసెన్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ : 111/5. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(41), సమాద్(9) పరుగులతో ఉన్నారు.
ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్.. త్రిపాఠి ఔట్
64 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ : 90/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(33), క్లాసెన్(6) పరుగులతో ఉన్నారు.
10 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 61/3
10 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్ 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(11), రాహుల్ త్రిపాఠి(10) ఉన్నారు.
మూడో వికెట్ డౌన్..
39 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్: 40/3
వారెవ్వా అర్ష్‌దీప్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆర్ష్‌దీప్ సింగ్ బిగ్ షాకిచ్చాడు. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లలో ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ట్రావిస్ హెడ్(21), తర్వాత మార్‌క్రమ్ డకౌటయ్యాడు. క్రీజులో అభిషేక్ శర్మ నితీష్ శర్మ ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్
Comments
Please login to add a commentAdd a comment