ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ సినిమా థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. . 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్‌లో విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. ఏకంగా 27 పరుగులు వచ్చాయి. గత మ్యాచ్ హీరోలు అశుతోష్ శర్మ(33; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్ సింగ్(46; 25 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, నటరాజన్, నితీష్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 64 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ విజయంపై సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
"మరోసారి క్లోజ్ మ్యాచ్‌ను చూడాల్సి వచ్చింది. తొలి 10 ఓవర్లలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేము మా బోర్డులో 180 పరుగుల స్కోర్‌ను ఉంచడానికి చాలా కష్టపడ్డాము. అనంతరం బౌలింగ్‌లో కూడా మేము మంచి ఆరంభాన్ని పొందాము. భువనేశ్వర్ కొత్త బంతితో అద్బుతం చేశాడు.
180 పరుగులు అనేది నా దృష్టిలో మంచి స్కోర్. 150 పైగా పరుగులు చేసి ఓడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ 180 ప్లస్ స్కోర్ సాధించి ఓడిపోవడం చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది. కొత్త బంతితో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయాలనుకున్నాం. భువీ నేను కొత్త బంతితో బౌలింగ్ చేసి వికెట్లు తీయాలన్నదే మా ప్లాన్.
మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేశాం. మా జట్టులో లెఫ్ట్ ఆర్మర్‌లు, రైట్ ఆర్మ్ పేసర్లు చాలా మంది ఉన్నారు. బ్యాటింగ్ పరంగా మేము పటిష్టంగానే ఉన్నాం. కాబట్టి పాజిటివ్ మైండ్‌తో ఆడి విజయాలు సాధించడమే మా లక్ష్యం. ఇక నితీష్ కుమార్ ఒక అద్బుతం. అతడి కోసం ఏమి మాట్లాడాలో కూడా నాకు ఆర్దం కావడం లేదు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్‌ను చూశాం.
అందుకే ఈ రోజు మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చి ముందు పంపించాం. మా నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. మేము 180 పైగా పరుగులు సాధించమంటే కారణం అతడే. అదేవిధంగా ఫీల్డ్, బౌలింగ్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని పోస్ట్‌మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment