PC: Insidesport
ఐపీఎల్-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కోసం పోటీపడే జట్లను భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు కమ్మిన్స్ కోసం పోటీ పడనున్నట్లు మంజ్రేకర్ జోస్యం చెప్పాడు.
కాగా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-2023కు దూరంగా ఉన్న కమ్మిన్స్.. ఐపీఎల్-2024 వేలంలో మాత్రం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కమ్మిన్స్‌పై కాసుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
"ప్యాట్ కమ్మిన్స్‌కు పిచ్ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేసే సత్తా ఉంది. అతడొక ఎక్స్ ఫ్యాక్టర్. ప్రస్తుతం కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు మంచి నాయకులు కోసం వెతుకుతున్నాయి. వేలంలో అతడిని దక్కించుకోనుందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఎస్‌ఆర్‌హెచ్‌కు మార్‌క్రమ్, పంజాబ్ కింగ్స్‌కు ధావన్ కెప్టెన్‌లగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కెప్టెన్‌గా కమ్మిన్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది.
ఈ నేపథ్యంలో పంజాబ్, ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీలు తమ జట్టు పగ్గాలు అప్పగించిన ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు . కాగా కమ్మిన్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ను కమ్మిన్స్ సారథ్యంలోని ఆసీస్ సొంతం చేసుకుంది. అదే విధంగా ఐపీఎల్‌లో కూడా కమ్మిన్స్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడిన కమ్మిన్స్ 379 పరుగులతో పాటు 45 వికెట్లు సాధించాడు.
చదవండి: అతడొక అద్భుతం.. పాక్ క్రికెట్‌లో లెజెండ్ అవుతాడు: గంభీర్
Comments
Please login to add a commentAdd a comment