న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తొడ కండరాల గాయం కారంణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దంబుల్లా వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో హసరంగా తొడ కండరాలు పట్టేశాయి.
గాయంతో బాధపడుతూనే తన బౌలింగ్ కోటాను హసరంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా వికెట్ల మధ్య కుంటుతూ కన్పించాడు. దీంతో అతడికి లంక మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానాన్ని దుషాన్ హేమంతతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.
దుషాన్ హేమంత శ్రీలంక తరపున ఇప్పటివరకు ఐదు వన్డేలు ఆడాడు. ఇటీవల ఎమర్జింగ్ ఆసియాకప్‌లో కూడా హేమంత అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుధవారం దంబుల్లా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
ఫెర్గూసన్‌కు గాయం..
మరోవైపు న్యూజిలాండ్‌కు కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దంబుల్లా వేదికగా లంకతో జరిగిన రెండో టీ20లో ఫెర్గూసన్ గాయ పడ్డాడు.
ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఫెర్గూసన్ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. కానీ అంతలోనే గాయపడడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని ఆడమ్ మిల్నేతో సెలక్టర్లు భర్తీ చేశారు.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు! అతడికి ఛాన్స్?
Comments
Please login to add a commentAdd a comment