డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గూసన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఫెర్గూసన్ తన స్పెల్ మొదటి ఓవర్ చివరి బంతికి ఓ వికెట్ (కుసాల్ పెరీరా).. ఆతర్వాత రెండో ఓవర్ తొలి రెండు బంతులకు రెండు వికెట్లు (కమిందు మెండిస్, అసలంక) తీశాడు. ఫెర్గూసన్.. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్‌గా (జేకబ్ ఓరమ్, టిమ్ సౌథీ (2), మైఖేల్ బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ).. ఓవరాల్‌గా టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన 64వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
The Lockie Ferguson hat-trick. 🌟pic.twitter.com/dhtmS1tLlp
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2024
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్‌సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక..ఫెర్గూసన్ (2-0-7-3), మిచెల్ సాంట్నర్ (3-0-10-1) ధాటికి 34 పరుగులకే (7.2 ఓవర్లలో) నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుసాల్ మెండిస్ 2, కుసాల్ పెరీరా 3, కమిందు మెండిస్ 1, అసలంక డకౌట్ కాగా.. పథుమ్ నిస్సంక (33), భానుక రాజపక్స్ (15) శ్రీలంకను విజయతీరాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
11.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 63/4గా ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే మరో 52 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment