శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ల ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్‌లతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం హసరంగ ఖాతాలో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్ పేరిట కూడా ఐదు ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి.
హసరంగ 23 టీ20 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకుంటే.. స్కై 22 సిరీస్‌ల్లో, బాబర్ ఆజమ్ 35, వార్నర్ 42, షకీబ్ 45 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 46 సిరీస్‌ల్లో ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది అతనికి ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో శ్రీలంక జట్టు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. హసరంగ (4-1-17-4), మతీశ పతిరణ (4-1-11-3, నువాన్ తుషార (4-0-22-2), తీక్షణ (3.3-0-16-1) దెబ్బకు 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక ఈ మాత్రం స్కోర్‌ను కూడా ఛేదించలేక 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ గెలుపులో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1 సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి శ్రీలంక పతనానికి బీజం వేసిన లోకీ ఫెర్గూసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆరు వికెట్లు తీసిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment