T20 World Cup 2021: Dinesh Karthik, Simon Doull chosen their team of the tournament: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇంగ్లండ్- న్యూజిలాండ్, పాకిస్తాన్- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్, న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ ఈ మెగా ఈవెంట్‌లో తమ ఫేవరెట్ ఎలెవన్‌ను ప్రకటించారు.
గ్రూపు-2లో ఐదింటికి ఐదు విజయాలతో పాకిస్తాన్‌ను టాపర్‌గా నిలిపి సెమీస్‌కు చేర్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను కార్తిక్ తన జట్టు సారథిగా ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం అద్భుతంగా జట్టును ముందుకు నడిపినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం కాస్త తడబడ్డాడన్న డీకే.. బాబర్ ఆజమ్ బ్యాట్‌తోనూ ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. అందుకే తనను కెప్టెన్‌గా ఎన్నుకున్నట్లు తెలిపాడు. ఇక టీమిండియా క్రికెటర్లలో కేవలం జస్‌ప్రీత్ బుమ్రాకు మాత్రమే స్థానం ఇచ్చాడు.
దినేశ్ కార్తిక్ ఎలెవన్ జట్టు
బాబర్ ఆజమ్(కెప్టెన్, పాకిస్తాన్), జోస్ బట్లర్(ఇంగ్లండ్), చరిత్ అసలంక(శ్రీలంక), రసే వాన్ డెర్ డసెన్(దక్షిణాఫ్రికా), షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), మొయిన్ అలీ(ఇంగ్లండ్), వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్), జస్‌ప్రీత్ బుమ్రా(ఇండియా), షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్).
ఇక సైమన్ డౌల్ సైతం బాబర్ ఆజమ్‌నే తన జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించడం విశేషం. అదే విధంగా డీకే మాదిరిగానే జోస్ బట్లర్, చరిత్ అసలంక, మొయిన్ అలీ, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్‌కు తన జట్టులో చోటిచ్చాడు.
సైమన్ డౌల్ జట్టు:
బాబర్ ఆజమ్(కెప్టెన్), జోస్ బట్లర్, చరిత్ అసలంక, ఎయిడెన్ మార్కరమ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, మొయిన్ అలీ, వనిందు హసరంగ, జోష్ హాజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, హారిస్ రవూఫ్.
చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్!
Babar Azam: దుమ్ములేపిన బాబర్ ఆజం.. వనిందు హసరంగా తొలిసారిగా
Comments
Please login to add a commentAdd a comment