
ICC WC 2023- Is Pakistan Knocked Out: వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ రేసులో నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు చేదు అనుభవం ఎదురైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బాబర్ టాస్ ఓడిపోవడంతో పాకిస్తాన్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది.
ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా శ్రీలంకపై జయభేరి మోగించి న్యూజిలాండ్ అనధికారికంగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సాంకేతికంగా పాక్‌కు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు ఉండేవి.
ఇంగ్లండ్‌పై 287 పరుగులతో గెలవడం లేదంటే.. ఇంగ్లండ్ విధించిన ఎంతటి లక్ష్యాన్నైనా 3 ఓవర్లలోపు ఛేదించడం వంటి సమీకరణలు ఉన్నాయి. అయితే, గత రికార్డుల దృష్ట్యా ఇది ఏ రకంగా చూసినా అసాధ్యంగానే కనిపిస్తోంది.
ఇక తాజాగా ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో పాక్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించడం లాంఛనమే అయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు బాబర్ ఆజం మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ గెలిచి.. రన్‌రేటు భారీగా పెంచుకుంటామని తెలిపాడు.
అయితే, అద్భుతం జరిగితే తప్ప అతడి మాటలు నిజమయ్యే ఛాన్స్ లేదు! కాబట్టి పాక్ ఖేల్ టాస్ వద్ద ఖతమైందని చెప్పొచ్చు! కానీ.. బాబర్ చెప్పినట్లు క్రికెట్‌లో ఎప్పుడు, ఏమైనా జరగొచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారా?! అయితే, పాజిటివిటీకి అది పరాకాష్ట లాంటిదే! సమీకరణాల దృష్ట్యా అలాంటి అవకాశం ఇప్పుడైతే లేదు మరి!!
ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది కాబట్టి!
►ఇంగ్లండ్ స్కోరు - 20, 1.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి
►ఇంగ్లండ్ స్కోరు - 50, పాక్ 2 ఓవర్లలోనే ఛేదించాలి
►ఇంగ్లండ్ - 100, 2.5 ఓవర్లలోనే పాక్ ఛేదించాలి
►ఇంగ్లండ్ - 150, పాక్ 3.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి
►ఇంగ్లండ్ - 200, 4.3 ఓవర్లలోనే పాక్ లక్ష్యాన్ని ఛేదించాలి
►ఇంగ్లండ్ - 300, పాక్ 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి.
చదవండి: కానిస్టేబుల్ కొడుకు నుంచి టీమిండియా క్రికెటర్ దాకా! సంజూ ఆస్తి ఎంతంటే!