శ్రీలంక బ్యాటర్ భనుక రాజపక్స
Asia Cup 2022 Winner Sri Lanka- Inzamam Ul Haq Comments: ఆసియా కప్-2022 టీ20 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను విజేతగా నిలపడంలో ఆ జట్టు బ్యాటర్ భనుక రాజపక్సదే కీలక పాత్ర. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న వేళ నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. చాంపియన్‌గా నిలడంలో తన వంతు సాయం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు 30 ఏళ్ల రాజపక్స. తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన స్ట్రైక్‌రేటుతో భనుక రాజపక్స రాణించి తీరు ప్రశంసనీయం. పాక్‌తో ఫైనల్లో అతడి స్ట్రైక్‌రేటు 157.78.
రాజపక్స
అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు!
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.. భనుక రాజపక్స ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఎక్కువ బంతులు తీసుకుని రాజపక్స కనుక ఈ డెబ్బై పరుగులు చేసి ఉంటే.. ఆ ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదని వ్యాఖ్యానించాడు. సరైన సమయంలో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడని ప్రశంసించాడు.
హసరంగ
భళా రాజపక్స, హసరంగ!
ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇంజమామ్ మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘హసరంగ 31 పరుగులు... రాజపక్స 71 పరుగులు చేశాడు. ఈ రెండు అద్భుతమైన ఇన్నింగ్స్. కఠిన పరిస్థితుల్లో.. ఒత్తిడిని జయించి వారు ఈ స్కోర్లు నమోదు చేశారు.
ఒకవేళ ఈ డెబ్బై పరుగులు చేసేందుకు గనుక రాజపక్స ఎక్కువ బంతులు తీసుకుని ఉంటే.. అప్పుడు లంక జట్టు స్కోరు 140 వరకు వచ్చి ఆగిపోయేది. అదే జరిగితే పాకిస్తాన్ సులువుగానే ఆ లక్ష్యాన్ని ఛేదించేది. అప్పుడు రాజపక్స ఇన్నింగ్స్ వృథాగా పోయేది. దానికసలు విలువే ఉండేది కాదు’’ అంటూ టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్‌రేటుకు ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పుకొచ్చాడు.
మా వాళ్లు చాలా తప్పులు చేశారు
ఇక తమ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘‘శ్రీలంక పేసర్లంతా కొత్తవాళ్లు. వాళ్లలో ఒక్కరికి కూడా తగినంత అనుభవం లేదు. అయినా.. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగారు. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీలో బాగానే ఆడింది.. కానీ మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు.
చాలా పొరపాట్లు చేశారు. ఒత్తిడిని అధిగమించలేకపోయారు. ఆదిలో శ్రీలంకను 58-5కు కట్టడి చేయగలిగినా ఆ తర్వాత ధారాళంగా పరుగులు ఇచ్చిన విధానమే ఇందుకు నిదర్శనం’’ అని పాక్ ఆట తీరుపై ఇంజమామ్ ఉల్ హక్ విమర్శలు గుప్పించాడు.
కాగా దుబాయ్ వేదికగా పాక్‌తో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక 23 పరుగులతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. మెగా ఈవెంట్‌లో ఆరోసారి టైటిల్ గెలిచిన జట్టుగా దసున్ షనక బృందం నిలిచింది.
చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్!
Comments
Please login to add a commentAdd a comment