Bhanuka Rajapaksa
-
ఎవిన్ లూయిస్ విధ్వంసకర శతకం
కరీబియర్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో తొలి శతకం నమోదైంది. సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఆటగాడు ఎవిన్ లూయిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో లూయిస్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో కైల్ మేయర్స్ కూడా శతకానికి చేరువగా వచ్చి ఔటయ్యాడు. మేయర్స్ 62 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లూసియా కింగ్స్ బౌలర్లలో డేవిడ్ వీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. భానుక రాజపక్స (35 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (27 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) పేట్రేగిపోవడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఆఖర్లో డేవిడ్ వీస్ (20 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించాడు. పేట్రియాట్స్ బౌలర్లలో కైల్ మేయర్స్, అన్రిచ్ నోర్జే తలో రెండు వికెట్లు, ఓడియన్ స్మిత్ ఓ వికెట్ పడగొట్టారు. ఎవిన్ లూయిస్ సెంచరీతో చెలరేగినా పేట్రియాట్స్ ఓడిపోవడం గమనార్హం. -
చెలరేగిన శ్రీలంక వికెట్‌కీపర్.. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో వీరవిహారం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గయనా అమెజాన్ వారియర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. సెయింట్ లూసియా కింగ్స్.. వారియర్స్‌కు తొలి ఓటమి రుచి చూపించింది. భారతకాలమానం ప్రకారం వారియర్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) ఉదయం జరిగిన మ్యాచ్‌లో లూసియా కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక వికెట్‌కీపర్ భానుక రాజపక్స (49 బంతుల్లో 86; 9 ఫోర్లు, 5 సిక్సర్లు).. కొలిన్ మున్రో (43 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో లూసియా కింగ్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. పాక్ ఆటగాడు ఆజమ్ ఖాన్ (25 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షాయ్ హోప్ (35 బంతుల్లో 38; 5 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. సైమ్ అయూబ్ 16, మాథ్యూ నందు 3, హెట్‌మైర్ 19 నాటౌట్, రొమారియో షెపర్డ్ 10 నాటౌట్, కీమో పాల్ 19 పరుగులు చేశారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ ఫోర్డ్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకన్నారు. మాథ్యూ నందు రనౌటయ్యాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లూసియా కింగ్స్.. రాజపక్స (86), మున్రో (55) రాణించడంతో 17.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (1) విఫలం కాగా.. సీన్ విలియమ్స్ (8), సికందర్ రజా (12) అజేయంగా నిలిచారు. అమెజాన్ వారియర్స్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, కీమో పాల్, కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ గెలుపుతో లూసియా కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. గయానా వారియర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. -
ధావన్ దెబ్బకు రిటైర్డ్‌హర్ట్.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్!
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసక ఆటగాడు బానుక రాజపక్స్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ కొట్టిన స్ట్రెయిట్ షాట్ రాజపక్స మోచేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో రాజపక్స విలవిల్లాడిపోయాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతికి ఇది చోటుచేసుకుంది. ఫిజియో వచ్చి రాజపక్సను పరిశీలించగా.. చేయి వాచిపోయింది. దీంతో బ్యాట్ పట్టుకోవడం కష్టమవడంతో రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. బంతి చేతికి బలంగా తాకడంతో గాయం తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ముందుగా రాజపక్సకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రిపోర్ట్‌లో పాజిటివ్ వస్తే రాజపక్స ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే పంజాబ్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అంతకముందు ప్రబ్‌సిమ్రన్ సింగ్ 34 బంతుల్లోనే 60 పరుగులు సాధించి పంజాబ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. రాజస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడిన ప్రబ్‌సిమ్రన్ మైదానం నలువైపులా షాట్లు ఆడి తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కాగా ప్రబ్‌సిమ్రన్‌కు ఐపీఎల్లో ఇదే తొలి అర్థశతకం కావడం విశేషం. Shikhar Dhawan's shot straight went to hit Bhanuka Rajapaksa on his forearm on the right hand. Not a great sign for Punjab Kings. 📸: Jio Cinema#CricTracker #RRvPBKS #BhanukaRajapaksa pic.twitter.com/gpDxOMj3vl — CricTracker (@Cricketracker) April 5, 2023 చదవండి: రాజస్తాన్ బౌలర్లను ఉతికారేశాడు.. ఎవరీ ప్రబ్‌సిమ్రన్ సింగ్ -
ఔట్ కాదనుకుంటా.. పాల్ స్టిర్లింగ్ మోసపోయాడు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌ను థర్డ్ అంపైర్ మోసం చేశాడు. స్టిర్లింగ్ ఔట్ కాదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ రిప్లేని మరోసారి చెక్ చేయకపోవడం ఐర్లాండ్ ఓపెనర్‌ను ముంచింది. ఫలితంగా పాల్ స్టిర్లింగ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఇది జరిగింది. ఆ ఓవర్లో ధనుంజయ డిసిల్వా వేసిన నాలుగో బంతిని పాల్ స్టిర్లింగ్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీలైన వద్ద ఉన్న బానుక రాజపక్స ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ముందుకు వచ్చి పట్టడంతో క్యాచ్‌పై క్లియర్ విజన్ కనిపించలేదు. అయితే తర్వాత రిప్లేలో రాజపక్స క్యాచ్ తీసుకున్న తర్వాత బంతిని గ్రౌండ్‌పై పెట్టినట్లు కనిపించింది. ఇది చూసిన పాల్ స్టిర్లింగ్ కాసేపు అలాగే నిలబడినప్పటికి థర్డ్ అంపైర్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఏం చేయలేక పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి స్టిర్లింగ్ 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Virat Kohli: పాక్‌తో మ్యాచ్.. కోహ్లి ముంగిట అరుదైన రికార్డు దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు NOT OUT! Paul Stirling should have been not out. Rajapaksa slid the ball on the ground before completing the catch. @FOXSports @ICC_CricInfo @cricketireland pic.twitter.com/0i4Bp9nRpJ — Jazz Vic AU (@JazzVicAU) October 23, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ..
Asia Cup 2022 Winner Sri Lanka- Inzamam Ul Haq Comments: ఆసియా కప్-2022 టీ20 టోర్నీ ఫైనల్లో శ్రీలంకను విజేతగా నిలపడంలో ఆ జట్టు బ్యాటర్ భనుక రాజపక్సదే కీలక పాత్ర. 36 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న వేళ నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. 45 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. చాంపియన్‌గా నిలడంలో తన వంతు సాయం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు 30 ఏళ్ల రాజపక్స. తీవ్రమైన ఒత్తిడిలోనూ అద్భుతమైన స్ట్రైక్‌రేటుతో భనుక రాజపక్స రాణించి తీరు ప్రశంసనీయం. పాక్‌తో ఫైనల్లో అతడి స్ట్రైక్‌రేటు 157.78. రాజపక్స అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.. భనుక రాజపక్స ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఎక్కువ బంతులు తీసుకుని రాజపక్స కనుక ఈ డెబ్బై పరుగులు చేసి ఉంటే.. ఆ ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదని వ్యాఖ్యానించాడు. సరైన సమయంలో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడని ప్రశంసించాడు. హసరంగ భళా రాజపక్స, హసరంగ! ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఇంజమామ్ మ్యాచ్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘హసరంగ 31 పరుగులు... రాజపక్స 71 పరుగులు చేశాడు. ఈ రెండు అద్భుతమైన ఇన్నింగ్స్. కఠిన పరిస్థితుల్లో.. ఒత్తిడిని జయించి వారు ఈ స్కోర్లు నమోదు చేశారు. ఒకవేళ ఈ డెబ్బై పరుగులు చేసేందుకు గనుక రాజపక్స ఎక్కువ బంతులు తీసుకుని ఉంటే.. అప్పుడు లంక జట్టు స్కోరు 140 వరకు వచ్చి ఆగిపోయేది. అదే జరిగితే పాకిస్తాన్ సులువుగానే ఆ లక్ష్యాన్ని ఛేదించేది. అప్పుడు రాజపక్స ఇన్నింగ్స్ వృథాగా పోయేది. దానికసలు విలువే ఉండేది కాదు’’ అంటూ టీ20 ఫార్మాట్లో స్ట్రైక్‌రేటుకు ఉన్న ప్రాధాన్యం గురించి చెప్పుకొచ్చాడు. మా వాళ్లు చాలా తప్పులు చేశారు ఇక తమ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. ‘‘శ్రీలంక పేసర్లంతా కొత్తవాళ్లు. వాళ్లలో ఒక్కరికి కూడా తగినంత అనుభవం లేదు. అయినా.. తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగారు. మరోవైపు.. పాకిస్తాన్ ఈ టోర్నీలో బాగానే ఆడింది.. కానీ మరీ అంత గొప్పగా ఏమీ ఆడలేదు. చాలా పొరపాట్లు చేశారు. ఒత్తిడిని అధిగమించలేకపోయారు. ఆదిలో శ్రీలంకను 58-5కు కట్టడి చేయగలిగినా ఆ తర్వాత ధారాళంగా పరుగులు ఇచ్చిన విధానమే ఇందుకు నిదర్శనం’’ అని పాక్ ఆట తీరుపై ఇంజమామ్ ఉల్ హక్ విమర్శలు గుప్పించాడు. కాగా దుబాయ్ వేదికగా పాక్‌తో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక 23 పరుగులతో గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. మెగా ఈవెంట్లో ఆరోసారి టైటిల్ గెలిచిన జట్టుగా దసున్ షనక బృందం నిలిచింది. చదవండి: SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం
Asia Cup 2022 Winner Sri Lanka- Losing Captain Babar Azam Comments: తమ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయామని.. అందుకే ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో ఓటమి పాలయ్యామని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. భనుక రాజపక్స ఆటతీరు అద్భుతమని.. అతడే మ్యాచ్‌ను శ్రీలంక వైపు తిప్పేశాడని కొనియాడాడు. అత్యద్భుతంగా ఆడి కప్ గెలిచినందుకు శ్రీలంక జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం శ్రీలంక- పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లంక ఆరంభంలో తడబడ్డా భనుక రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులతో చెలరేగడంతో మెరుగైన స్కోరు సాధించింది. రాజపక్స అదరగొట్టడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్(55), ఇఫ్తికర్ అహ్మద్(32) తప్ప ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్ల ధాటికి నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది. విజేతగా లంక 23 పరుగుల తేడాతో పాక్‌పై జయభేరి మోగించిన దసున్ షనక బృందం ఆసియా కప్ 15వ ఎడిషన్ చాంపియన్‌గా అవతరించింది. ఆల్‌రౌండ్ ప్రతిభతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక పాక్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మా ఓటమికి ప్రధాన కారణం అదే! ఈ నేపథ్యంలో ఫైనల్లో లంక చేతిలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తాము విఫలమయ్యామన్నాడు. ‘‘మొదటి ఎనిమిది ఓవర్లు మా ఆధిపత్యం కొనసాగింది. అయితే, రాజపక్స వచ్చిన తర్వాత సీన్ మారింది. అతడు అద్భుతంగా ఆడాడు. దుబాయ్ వికెట్ ఎంతో బాగుంటుంది. అందుకే ఇక్కడ ఆడటాన్ని ఇష్టపడతాము. కానీ.. ఈరోజు మా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేదు. ఇక.. శుభారంభం దొరికినా.. ప్రత్యర్థి జట్టుకు 15-20 పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నాం. ఫీల్డింగ్ కూడా బాగా చేయలేకపోయాం. సానుకూల అంశాలు కూడా ఉన్నాయి! అయితే, ఈ టోర్నీలో మాకు కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రిజ్వాన్, నవాజ్, నసీమ్.. అద్భుతంగా రాణించారు. ఆటలో గెలుపోటములు సహజం. నిజానికి ఫైనల్లో మేము చాలా తక్కువ తప్పులే చేశాము. ఇంకా మెరుగ్గా ఆడితే బాగుండేది’’ అని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ఇక ఫైనల్లో రాజపక్స ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు దక్కింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఇదేమి బౌలింగ్రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు! -
ఎన్నాకెన్నాళ్లకు.. ఆసియా కప్‌తో లంకలో పండుగ (ఫొటోలు)
-
పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్
15వ ఎడిషన్ ఆసియా కప్ విజేతగా శ్రీలంక అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ట్రోఫిని అందుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్ రిజ్వాన్(55 పరుగులు), ఇఫ్తికర్ అహ్మద్(32 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు లక్ష్యం దిశగానే సాగింది. అయితే లంక బౌలర్ ప్రమోద్ మదుషన్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా కీలక సమయంలో మూడు వికెట్లతో మెరిశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం.పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. కాగా శ్రీలంక ఆసియా కప్‌ను సొంతం చేసుకోవడం ఇది ఆరోసారి. తాజాగా దాసున్ షనక కెప్టెన్సీలో లంక టైటిల్ నెగ్గగా.. చివరగా 2014లో ఏంజల్లో మాథ్యూస్ నేతృత్వంలోని లంక జట్టు వన్డే ఫార్మాట్లో జరిగిన అప్పటి ఆసియా కప్‌లోనూ పాక్‌ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజపక్స..
ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్ పోరులో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లంక.. కనీసం 150 పరుగుల మార్క్‌ను దాటుతుందా అన్న అనుమానం కలిగింది. కానీ వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం. శ్రీలంక స్కోరు 170 ఉండగా.. అందులో రాజపక్సవే 71 పరుగులు ఉన్నాయి. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Kushal Mendis: అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు