SL Vs PAK, Asia Cup Final 2022: Babar Azam Spoke About His Team's Mistakes In The Final Match Against Sri Lanka - Sakshi
Sakshi News home page

Asia Cup 2022 Final: అందుకే శ్రీలంక చేతిలో ఓడిపోయాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్‌ ఆజం

Published Mon, Sep 12 2022 10:17 AM | Last Updated on Mon, Sep 12 2022 12:25 PM

Asia Cup 2022 Final: Babar Azam Says Did Not Bat According To Our Potential - Sakshi

సహచర ఆటగాళ్లతో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(PC: PCB)

Asia Cup 2022 Winner Sri Lanka- Losing Captain Babar Azam Comments: తమ స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయామని.. అందుకే ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో ఓటమి పాలయ్యామని పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం అన్నాడు. భనుక రాజపక్స ఆటతీరు అద్భుతమని.. అతడే మ్యాచ్‌ను శ్రీలంక వైపు తిప్పేశాడని కొనియాడాడు. అత్యద్భుతంగా ఆడి కప్‌ గెలిచినందుకు శ్రీలంక జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆసియా కప్‌-2022 టోర్నీలో భాగంగా దుబాయ్‌ వేదికగా ఆదివారం శ్రీలంక- పాకిస్తాన్‌ జట్లు ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే.

టాస్‌ గెలిచి..
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లంక ఆరంభంలో తడబడ్డా భనుక రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులతో చెలరేగడంతో మెరుగైన స్కోరు సాధించింది. 

రాజపక్స అదరగొట్టడంతో..
నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు పాక్‌ జట్టులో మహ్మద్‌ రిజ్వాన్‌(55), ఇఫ్తికర్‌ అహ్మద్‌(32) తప్ప ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక బౌలర్ల ధాటికి నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేసి పాకిస్తాన్‌ ఆలౌట్‌ అయింది.

విజేతగా లంక
23 పరుగుల తేడాతో పాక్‌పై జయభేరి మోగించిన దసున్‌ షనక బృందం ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ చాంపియన్‌గా అవతరించింది. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక పాక్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

మా ఓటమికి ప్రధాన కారణం అదే!
ఈ నేపథ్యంలో ఫైనల్లో లంక చేతిలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో తాము విఫలమయ్యామన్నాడు. ‘‘మొదటి ఎనిమిది ఓవర్లు మా ఆధిపత్యం కొనసాగింది. అయితే, రాజపక్స వచ్చిన తర్వాత సీన్‌ మారింది. అతడు అద్భుతంగా ఆడాడు. 

దుబాయ్‌ వికెట్‌ ఎంతో బాగుంటుంది. అందుకే ఇక్కడ ఆడటాన్ని ఇష్టపడతాము. కానీ.. ఈరోజు మా స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్‌ చేయలేదు. ఇక.. శుభారంభం దొరికినా.. ప్రత్యర్థి జట్టుకు 15-20 పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నాం. ఫీల్డింగ్‌ కూడా బాగా చేయలేకపోయాం.

సానుకూల అంశాలు కూడా ఉన్నాయి!
అయితే, ఈ టోర్నీలో మాకు కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రిజ్వాన్‌, నవాజ్‌, నసీమ్‌.. అద్భుతంగా రాణించారు. ఆటలో గెలుపోటములు సహజం. నిజానికి ఫైనల్లో మేము చాలా తక్కువ తప్పులే చేశాము. ఇంకా మెరుగ్గా ఆడితే బాగుండేది’’ అని బాబర్‌ ఆజం చెప్పుకొచ్చాడు. ఇక ఫైనల్లో రాజపక్స ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు లంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగకు దక్కింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ఇదేమి బౌలింగ్‌రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement