టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌ను థర్డ్ అంపైర్ మోసం చేశాడు. స్టిర్లింగ్ ఔట్ కాదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ రిప్లేని మరోసారి చెక్ చేయకపోవడం ఐర్లాండ్ ఓపెనర్‌ను ముంచింది. ఫలితంగా పాల్ స్టిర్లింగ్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఐర్లాండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ఇది జరిగింది. ఆ ఓవర్‌లో ధనుంజయ డిసిల్వా వేసిన నాలుగో బంతిని పాల్ స్టిర్లింగ్ లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీలైన వద్ద ఉన్న బానుక రాజపక్స ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ముందుకు వచ్చి పట్టడంతో క్యాచ్‌పై క్లియర్ విజన్ కనిపించలేదు. అయితే తర్వాత రిప్లేలో రాజపక్స క్యాచ్ తీసుకున్న తర్వాత బంతిని గ్రౌండ్‌పై పెట్టినట్లు కనిపించింది.
ఇది చూసిన పాల్ స్టిర్లింగ్ కాసేపు అలాగే నిలబడినప్పటికి థర్డ్ అంపైర్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో ఏం చేయలేక పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికి స్టిర్లింగ్ 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Virat Kohli: పాక్‌తో మ్యాచ్.. కోహ్లి ముంగిట అరుదైన రికార్డు
దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు
NOT OUT!
— Jazz Vic AU (@JazzVicAU) October 23, 2022
Paul Stirling should have been not out. Rajapaksa slid the ball on the ground before completing the catch. @FOXSports @ICC_CricInfo @cricketireland pic.twitter.com/0i4Bp9nRpJ
Comments
Please login to add a commentAdd a comment