ఆసియాకప్-2022 మహా సంగ్రామానికి ఆదివారంతో తెరపడింది. ఈ మెగా ఈవెంట్ ఛాంపియన్స్‌గా శ్రీలంక నిలిచింది. అదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక ట్రోఫీని కైవసం చేసుకుంది.
కాగా ఇది శ్రీలంకకు 6వ ఆసియాకప్ టైటిల్ కావడం గమనార్హం. ఇక అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి ఛాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్‌మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ టాప్ రన్ స్కోరర్ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
విజేతకు ఎంతంటే?
ఆసియాకప్ విజేతగా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్‌మనీ రూపంలో లక్షా ఏభై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను బీసీసీఐ అద్యక్షుడు సౌరవ్ గంగూలీ శ్రీలంక కెప్టెన్ దసన్ శనకకు అందజేశాడు. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు 75,000 డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం డెబ్బై తొమ్మిది లక్షల అరవై ఆరు వేలు) ఫ్రైజ్‌మనీ దక్కింది.
ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు వీరులు వీరే
మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 6 మ్యాచ్‌ల్లో 281 పరుగులు
విరాట్ కోహ్లి(భారత్)- 5 మ్యాచ్‌ల్లో 276 పరుగులు
ఇబ్రహీం జద్రాన్(ఆఫ్గాన్)- 5 మ్యాచ్‌ల్లో-196 పరుగులు
భానుక రాజపక్స(శ్రీలంక)- 6 మ్యాచ్‌ల్లో 191 పరుగులు
పాతుమ్ నిస్సంక(శ్రీలంక) - 6 మ్యాచ్‌ల్లో 173 పరుగులు
ఆసియాకప్‌లో అత్యదిక వికెట్లు తీసిన బౌలర్లు
భువనేశ్వర్ కుమార్(భారత్)- 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు
వానిందు హసరంగా(శ్రీలంక)- 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు
మహ్మద్ నవాజ్(పాకిస్తాన్)- 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు
షాదాబ్ ఖాన్(పాకిస్తాన్)- 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు
హారిస్ రౌఫ్(పాకిస్తాన్)- 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇక ఈ మెగా ఈవెంట్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగాకు మ్యాన్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. అదే విధంగా కీలకమైన ఫైనల్‌లో పోరులో 71 పరుగలతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్సకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
చదవండి: Asia Cup 2022 Final: అలా అయితే రాజపక్స 70 పరుగులకు విలువే ఉండేది కాదు! కానీ..: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment