Sri Lanka All Rounder Wanindu Hasaranga Gets Married Ahead IPL 2023, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Wanindu Hasaranga: పెళ్లి చేసుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్‌.. ఫొటోలు వైరల్‌!

Published Thu, Mar 9 2023 7:12 PM | Last Updated on Thu, Mar 9 2023 7:31 PM

Sri Lanka All Rounder Wanindu Hasaranga Gets Married Ahead IPL 2023 - Sakshi

వివాహ బంధంలో అడుగుపెట్టిన హసరంగ(PC: Instagram)

Wanindu Hasaranga Marriage Pics Goes Viral: శ్రీలంక క్రికెటర్‌ వనిందు హసరంగ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. వింధ్య అనే యువతిని పెళ్లాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. అత్యంత సన్నిహితుల నడుమ గురువారం వనిందు హసరంగ- వింధ్య పెళ్లి జరిగింది. 


PC: Instagram

జంట ఎలా ఉందంటే!
తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఈ ఆల్‌రౌండర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. జంట చూడముచ్చటగా ఉందంటూ అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.


PC: Instagram

టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. అయితే, పెళ్లి పనులతో బిజీ అయిపోయిన వనిందు హసరంగ కివీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆరంభమయ్యే నాటికి ఈ కొత్త పెళ్లికొడుకు జట్టుతో కలిసే అవకాశం ఉంది. కాగా మార్చి 9 నుంచి న్యూజిలాండ్‌- లంక మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభమైంది.

ఐపీఎల్‌లో
ఇరు జట్ల మధ్య మార్చి 25- 31 మూడు వన్డేలు, ఏప్రిల్‌ 2- 8 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో వనిందు హసరంగ రాయల్‌ చాలెంజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2023 తాజా సీజన్‌లో ఈ ఆల్‌రౌండర్‌ ఆర్సీబీకి కీలకంగా మారనున్నాడు. 

లంక తరఫున
ఇక 25 ఏళ్ల ఈ యువ ఆల్‌రౌండర్‌ లంక తరఫున జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 4 టెస్టులు, 37 వన్డేలు, 55 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 196 పరుగులు చేసి, 4 వికెట్లు.. వన్డేల్లో 710 పరుగులు సాధించి.. 39 వికెట్లు.. టీ20లలో 503 పరుగులు చేసి.. 89 వికెట్లు పడగొట్టాడు.  అదే విధంగా ఐపీఎల్‌లో 18 మ్యాచ్‌లు ఆడి 39 పరుగులు చేయడంతో పాటు 26 వికెట్లు తీశాడు.

చదవండి: IND Vs AUS: విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్‌ తయారు చేస్తారా?
BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement