T20 World Cup 2021 SL Vs IRE: 70 పరుగుల తేడాతో విజయం... సూపర్‌-12కు అర్హత | T20 World Cup 2021: Sri Lanka Beat Ireland Qualified For Super 12 | Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 SL Vs IRE: 70 పరుగుల తేడాతో విజయం... సూపర్‌–12 దశకు శ్రీలంక అర్హత

Published Thu, Oct 21 2021 9:53 AM | Last Updated on Thu, Oct 21 2021 10:13 AM

T20 World Cup 2021: Sri Lanka Beat Ireland Qualified For Super 12 - Sakshi

PC: ICC

T20 World Cup 2021 SL Vs IRE: మాజీ చాంపియన్‌ శ్రీలంక టి20 ప్రపంచకప్‌లో తొలి దశను విజయవంతంగా దాటింది. బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించి సూపర్‌–12 దశకు అర్హత పొందింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హసరంగ (47 బంతుల్లో 71; 10 ఫోర్లు, 1 సిక్స్‌), నిసాంకా (47 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు.

ఐర్లాండ్‌ బౌలర్లలో జోష్‌ లిటిల్‌ 23 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఐర్లాండ్‌ 18.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ ఆండీ బల్బర్నీ (39 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మహీశ్‌ తీక్షణ (3/17) కీలక వికెట్లతో ఐర్లాండ్‌ను దెబ్బ తీయగా, 16 పరుగుల వ్యవధిలోనే ఐర్లాండ్‌ చివరి 6 వికెట్లు కోల్పోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement